Oppo : ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో.. ఒప్పో నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు..!

Oppo : మొబైల్స్ త‌యారీ సంస్థ ఒప్పో.. ఎఫ్21 ప్రొ, ఎఫ్‌21 ప్రొ 5జి పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్‌ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. వీటి ధ‌ర‌లు కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఈ రెండు ఫోన్లు వినియోగ‌దారులను ఆక‌ర్షిస్తున్నాయి. ఇక వీటిలో అందిస్తున్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Oppo

ఒప్పో ఎఫ్ 21 ప్రొ స్మార్ట్ ఫోన్‌లో.. 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. ఈ డిస్‌ప్లే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. క‌నుక దృశ్యాలు నాణ్యంగా క‌నిపిస్తాయి. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ విడుద‌లైంది.

ఒప్పో ఎఫ్ 21 ప్రొ ఫోన్‌లో.. ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ మైక్రో స్కోపిక్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇక ఒప్పో ఎఫ్ 21ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ మోనో క్రోమ్‌ కెమెరా, ఇంకో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇక ఒప్పో ఎఫ్ 21 ప్రొ ఫోన్ ధ‌ర రూ.22,999 ఉండ‌గా.. దీన్ని ఏప్రిల్ 15వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. అలాగే ఒప్పో ఎఫ్ 21 ప్రొ 5జి ఫోన్ ధ‌ర రూ.26,999గా ఉంది. దీన్ని ఏప్రిల్ 21వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు. ఇక లాంచింగ్ సంద‌ర్భంగా ఈ ఫోన్‌ల‌పై ఆఫ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోట‌క్‌, స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్‌, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క్రెడిట్ కార్డుల‌తో ఈ ఫోన్‌ల‌పై 10 శాతం క్యాష్ బ్యాక్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ల‌భిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM