Vishnu Priya : బుల్లి తెరపై యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వారిలో యాంకర్ విష్ణు ప్రియ ఒకరు. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా టీవీ షోల్లో పాల్గొనడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేసే ఈ భామ.. అప్పుడప్పుడు గ్లామరస్ వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ అలరిస్తుంటుంది.
విష్ణు ప్రియ తన డ్యాన్స్‌లతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఏదో ఒక పాటకు అద్భుతమైన రీతిలో డ్యాన్స్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఆమె డ్యాన్స్ చేసినప్పుడల్లా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. అయితే అంతా బాగానే ఉంది.. కానీ ఆమె తాజాగా అలాంటిదే ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేయగా.. దానిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా విష్ణు ప్రియ సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తుందనుకుంటే.. గ్లామరస్ వీడియోతో కనిపించింది. ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ అందాలను ఆరబోసింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. అయితే ఆమె ఎప్పుడు చేసే వీడియోల్లాగే ఆ వీడియోలోనూ డ్యాన్స్ చేసింది. కానీ ఆ రోజు శ్రీరామనవమి కావడం.. పైగా ఇలాగే డ్యాన్స్‌లు చేయాలి.. అంటూ ఆమె ఆ వీడియోకు కామెంట్ పెట్టడం.. అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.
పండుగ రోజు సంప్రదాయ దుస్తులు ధరించకుండా ఇలాంటి డ్రెస్‌లో కనిపించి ఇంత ఛండాలమైన పని చేశావ్.. అసలు నువ్వు చేసిన పని ఏంటి తెలుస్తుందా ? అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. అయినప్పటికీ ఆమె వీడియో మాత్రం వైరల్ అవుతూనే ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…