పొగాకు, మ‌ద్యం ఉత్ప‌త్తుల‌కు చెందిన యాడ్స్ మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌వు.. ఎందుకో తెలుసా ?

July 18, 2021 9:27 PM

మ‌నం నిత్యం వార్తా ప‌త్రిక‌లు, వెబ్‌సైట్లు, యూట్యూబ్ చాన‌ల్స్, సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌, టీవీలు.. ఇలా ఎక్క‌డ చూసినా మ‌న‌కు ఎన్నో ర‌కాల యాడ్స్ క‌నిపిస్తుంటాయి. అనేక కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం క‌ల్పించేందుకు లేదా ఉత్ప‌త్తుల‌ను, సేవ‌ల‌ను అందించేందుకు అలా యాడ్స్ ఇస్తుంటాయి. వాటిల్లో భిన్న ర‌కాల యాడ్స్ ఉంటాయి. అయితే దాదాపుగా అన్ని ర‌కాల వ‌స్తువుల‌కు చెందిన యాడ్స్ ను మ‌నం చూస్తుంటాం. కానీ మ‌ద్యం, పొగాకు ఉత్ప‌త్తుల‌కు సంబంధించి యాడ్స్ మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌వు. అవును క‌దా.. అయితే దీని వెనుక ఉన్న అస‌లు విష‌యం ఏమిటో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

why liquor and tobacco ads not seen

1995లో అప్ప‌టి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ రీసెర్చ్ చేయించింది. దాని ప్ర‌కారం, పొగాకు, మ‌ద్యం ఉత్ప‌త్త‌ల‌కు చెందిన యాడ్స్ ను ఇవ్వ‌డం వ‌ల్ల వాటికి ప్ర‌జ‌ల‌కు బాగా బానిస‌ల‌వుతున్నార‌ని, పొగ ఎక్కువ‌గా తాగుతున్నార‌ని, మ‌ద్యం ఎక్కువ‌గా సేవిస్తున్నార‌ని.. దీని వ‌ల్ల చాలా మంది ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయ‌ని వెల్ల‌డైంది. అందుక‌ని అప్ప‌టి నుంచి ఆ రెండు ఉత్ప‌త్తుల‌కు చెందిన యాడ్స్ ను ఎక్క‌డా ప్ర‌సారం గానీ, ప్రింట్ గానీ చేయ‌కుండా నిషేధించారు. అందుక‌నే మ‌న‌కు దేశంలో ఎక్క‌డ చూసినా మ‌ద్యం, పొగాకు ఉత్ప‌త్తుల‌కు చెందిన యాడ్స్ క‌నిపించ‌వు.

అయితే మ‌ద్యం కంపెనీలు ఊరుకోలేదు. త‌మ బ్రాండ్ల ఉత్ప‌త్తుల‌ను భిన్నంగా ప్ర‌చారం చేసుకోవ‌డం ప్రారంభించాయి. అవి మ్యూజిక్ సీడీలు, క్యాసెట్లు, మిన‌ర‌ల్ వాట‌ర్‌, సోడాల పేరిట ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయ‌డం ప్రారంభించాయి. కానీ వాటికి మ‌ద్యం బ్రాండ్ల‌ పేర్లే ఉంటాయి. ఈ క్ర‌మంలో వాటికి యాడ్స్‌ను ఇస్తున్నారు. స‌హ‌జంగానే మ‌ద్యం ప్రియులు ఆ యాడ్స్‌ను చూస్తే స‌ద‌రు ఉత్ప‌త్తులు గుర్తుకు రావు. మ‌ద్య‌మే గుర్తుకు వ‌స్తుంది. దీంతో ప‌బ్లిసిటీ అయిపోతుంది. అందుక‌నే మద్యం కంపెనీలు పైన చెప్పిన విధంగా ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తూ ప‌రోక్షంగా త‌మ మ‌ద్యం బ్రాండ్ల‌కు ప్ర‌చారం క‌ల్పిస్తున్నాయి. ఇదీ.. అస‌లు విష‌యం.

అయితే దీని వెనుక బ్రిట‌న్ తీసుకున్న నిర్ణ‌య‌మే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అప్ప‌ట్లో బ్రిట‌న్‌లోనూ మ‌ద్యం, పొగాకు ఉత్ప‌త్తుల‌కు చెందిన యాడ్స్ ను ఇచ్చేవారు. కానీ అక్క‌డ ప్ర‌జ‌లు విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తున్నార‌ని భావించిన బ్రిట‌న్ ఆయా ఉత్ప‌త్తుల‌కు యాడ్స్ ఇవ్వ‌కుండా నిషేధించింది. త‌రువాత మ‌న దేశంలోనూ స‌రిగ్గా ఇలాగే నిషేధం అమ‌లులోకి వ‌చ్చింది. అందుక‌ని అప్ప‌టి నుంచి పొగాకు, మ‌ద్యం ఉత్ప‌త్తుల‌కు చెందిన యాడ్స్ మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. ఇదీ.. దీని వెనుక ఉన్న అస‌లు కార‌ణం. అయిన‌ప్ప‌టికీ ప‌రోక్షంగా మ‌ద్యం కంపెనీలు పైన చెప్పిన విధంగా త‌మ బ్రాండ్ల‌కు ప్ర‌చారం క‌ల్పిస్తూనే ఉన్నాయి.. ఇలా ఇప్ప‌టికీ జ‌రుగుతూనే ఉంది..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment