Lawyers : న్యాయవాదులు నలుపు రంగు కోటు ఎందుకు ధరిస్తారు..? కారణం ఏమిటంటే..?

December 18, 2023 10:21 PM

Lawyers : న్యాయవాదులు నలుపు రంగు కోటు మాత్రమే వేసుకుంటూ ఉంటారు. సినిమాల్లో అయినా బయట అయినా సరే న్యాయవాదులు, నల్లకోటు వేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. డాక్టర్లు ఎలా అయితే, తెల్ల కోటు వేసుకుంటారో, న్యాయవాదులు నల్లకోటు వేసుకుంటారు. దాని వెనక కారణం ఏంటి..? ఎందుకు న్యాయవాదులు నల్లకోటిని మాత్రమే వేసుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. 19వ శతాబ్దంలో న్యాయవాదులు న్యాయమూర్తులు నలుపు రంగు కోటు ధరించే పద్ధతి మొదలైంది. వైద్యులు కూడా నల్లకోటు ధరించడం మొదలుపెట్టారు. 19వ శతాబ్దం వరకు, వైద్యులు న్యాయవాదులు నల్లకోటు వేసుకునేవారు.

ఇలా అప్పటి నుండి కూడా, ఇది మొదలైంది. కాలక్రమమైన వైద్యులు పరిశుభ్రతను ప్రోత్సహించడానికి, కోటు రంగు ని తెల్లగా మార్చుకున్నారు. నలుపు రంగు రెండు కారణాల కోసం ఎంపిక చేయబడింది. ఇది వరకు తక్కువ రంగులే ఉండేవి. చాలా బట్టలు నల్ల రంగు లోనే ఉండేవి. బ్లాక్ కోట్ ధరించడానికి మరో ముఖ్యమైన కారణం నలుపు అధికారాన్ని సూచిస్తుంది. న్యాయవాదులు న్యాయం పట్ల, తమ అంకిత భావాన్ని చూపించడానికి నలుపు రంగు బట్టలు వేసుకుంటారు.

why do Lawyers wear black coats
Lawyers

తెలుపు రంగు కాంతి, మంచితనం, అమాయకత్వం, స్వచ్ఛతను సూచిస్తే నలుపు రంగు న్యాయాన్ని సూచిస్తుంది. లాయర్ యొక్క గుర్తింపుకు తీవ్రమైన రూపాన్ని, ఈ నల్లకోటు ఇస్తుంది, నల్లని వస్త్రాలు ధరించడం వలన, న్యాయవాదులలో క్రమశిక్షణ భావం ఏర్పడుతుంది. అధికార భావం కలుగుతుంది.

నలుపు గౌరవం, న్యాయానికి చిహ్నం. అందుకే నలుపు రంగు కోటు వేసుకుంటారు. భారతదేశంలో న్యాయవాదులు నల్లకోటు, తెల్ల చొక్కా వేసుకుంటారు. అలానే, తెల్లటి నెక్ బ్యాండ్ లని వేసుకుంటారు. ఇలా నల్లకోటు వేసుకోవడం బ్రిటిష్ న్యాయ శాస్త్రం నుండి ప్రేరణ పొందింది. భారతీయ న్యాయవాదులు కూడా ఈ విధానాన్ని అనుసరించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now