మన దేశంలో చాలా మందికి పెరుగు అంటే ఇష్టమే. భోజనం చివర్లో పెరుగన్నం తినకపోతే భోజనం చేసిన భావన కలగదు. ఉత్తరాదివారు పెరుగులో చక్కెర కలుపుకుని తింటారు. దక్షిణాది వారు అన్నంలో పెరుగు కలిపి తింటారు. అయితే పెరుగు నీళ్లలా ఉండే కన్నా గట్టిగా గడ్డ కట్టినట్లు ఉంటేనే చాలా మందికి ఇష్టం. అందుకనే హోటళ్లు, రెస్టారెంట్లలో పెరుగు గడ్డకట్టినట్లు ఉంటుంది. దీని వెనుక ఉండే అసలు కారణం ఏమిటో తెలుసా ?
పాలలో కొవ్వు తీయకుండా పెరుగు తయారు చేస్తే పెరుగు గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా పెరుగు గట్టిగా ఉండేందుకు దోహదపడతాయి. కానీ రెస్టారెంట్లలో మాత్రం కొవ్వు తీసిన పాలతోనే పెరుగును గట్టిగా తయారు చేస్తారు. అందుకు గాను వారు అందులో కార్న్ ఫ్లోర్, వెనిగర్‌లను కలుపుతారు. అందుకనే రెస్టారెంట్లలో పెరుగు గడ్డ కట్టినట్లు మనకు గట్టిగా కనిపిస్తుంది.
అయితే అలాంటి పెరుగును తినొద్దని చెప్పలేం. కార్న్ ఫ్లోర్, వెనిగర్‌లు తినదగిన పదార్థాలే. అందువల్ల ఆ పెరుగును తింటే ఎలాంటి హానీ కలగదు. కాకపోతే మనం పెరుగుకు డబ్బులు ఇస్తున్నాం కదా, కానీ రెస్టారెంట్ వారు మాత్రం స్వచ్ఛమైన గడ్డ పెరుగును మనకు ఇవ్వరు, అందులో పలు రకాల పదార్థాలను కలిపి తయారు చేసింది ఇస్తారు, కనుక అలాంటి పెరుగును తింటామా ? తినలేం కదా, మనం డబ్బులు ఇచ్చేది స్వచ్ఛమైన పెరుగుకు.. అంతేకానీ.. అలా మిక్స్ చేయబడిన పదార్థాలతో తయారు చేసిన పెరుగుకు కాదు.
కనుక రెస్టారెంట్లలో గడ్డ పెరుగును తినాలా, వద్దా ? అనేది ఎవరికి వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే పెరుగును తినడం వల్ల లాభాలే కలుగుతాయి, నష్టం ఉండదు. కనుక ఎవరికి వారు నిర్ణయం తీసుకుని ఆ విధంగా పెరుగును తినవచ్చు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…