చిప్స్ ప్యాకెట్లలో స‌గం వ‌ర‌కు మాత్ర‌మే చిప్స్ ఉంటాయి.. మిగిలిన స‌గం గాలి ఉంటుంది.. అలా ఎందుకు నింపుతారో తెలుసా ?

July 17, 2021 3:15 PM

ఒక‌ప్పుడు బ‌య‌ట చిప్స్ షాపుల్లో దొరికే ఆలు చిప్స్ ను జ‌నాలు ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పుడు వాటికి బ‌దులుగా ర‌క ర‌కాల చిప్స్ ల‌భిస్తున్నాయి. భిన్న ర‌కాల‌కు చెందిన కంపెనీలు ర‌క ర‌కాల ఫ్లేవ‌ర్ల‌లో చిప్స్ ను త‌యారు చేసి అందిస్తున్నాయి. ట‌మాటా, కార్న్‌, చిల్లీ.. ఇలా భిన్న ఫ్లేవ‌ర్ల‌లో మ‌న‌కు చిప్స్ అందుబాటులో ఉన్నాయి.

why chips packets have air

అయితే చిప్స్ ప్యాకెట్లలో చిప్స్ స‌గం వ‌ర‌కే ఉంటాయి. మిగిలిన స‌గం మొత్తం ఖాళీగా ఉంటుంది. మ‌నం ఏ చిప్స్ ప్యాకెట్‌ను తెరిచినా చిప్స్ మ‌న‌కు అలాగే స‌గం వ‌ర‌కే క‌నిపిస్తాయి. మిగిలిన సగం ఖాళీగా ఉంటుంది. దీంతో ప్యాకెట్ కూడా బెలూన్ ఉబ్బిన‌ట్లు మ‌న‌కు క‌నిపిస్తుంది. అయితే చిప్స్ ను స‌గం వ‌ర‌కే నింపి మిగిలిన స‌గంలో గాలిని ఎందుకు నింపుతారో తెలుసా ? అదే ఇప్పుడు చూద్దాం.

చిప్స్‌ను ఆయిల్‌తో త‌యారు చేస్తారు క‌దా. అవి ఎక్కువ రోజుల పాటు ఉండ‌వు. పాడైపోతాయి. అందువ‌ల్ల వాటిని పాడైపోకుండా ఉంచేందుకు చిప్స్ ప్యాకెట్ల‌లో స‌గం వ‌ర‌కు నైట్రోజ‌న్ గ్యాస్‌ను నింపుతారు. ఇది ఆహారాల‌ను పాడు కాకుండా చూస్తుంది. అందుకే స‌గం వ‌ర‌కు ఆ గ్యాస్‌ను నింపుతారు. ఇక అలా నింప‌డం వ‌ల్ల చిప్స్ విరిగిపోకుండా కూడా ఉంటాయి. అందువ‌ల్లే ఆ ప్యాకెట్ల‌ను స‌గం వ‌ర‌కు గాలితో నింపుతారు. కానీ కంపెనీలు కావాల‌నే అటా చేస్తున్నాయేమో, మ‌న‌కు సగం వ‌ర‌కు మాత్ర‌మే చిప్స్ ఇచ్చి మ‌న‌ల్ని మోస‌గిస్తున్నాయేమోన‌ని మ‌నం అనుకుంటాం. కానీ అస‌లు కార‌ణం.. పైన చెప్పిందే..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment