ఆఫ్‌బీట్

దెయ్యాలు మ‌న చుట్టూ ఉంటే ఎలాంటి సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా ?

చ‌నిపోయిన వారి ఆత్మ‌లు మ‌న చుట్టే తిరుగుతాయ‌ని, మ‌నతోనే ఉంటాయ‌ని చెబుతారు. ఆత్మ‌ల‌నే దెయ్యాలు కూడా అని పిలుస్తారు. కోరిన కోర్కెలు నెర‌వేర‌ని వారి ఆత్మ‌లు దెయ్యాలుగా మారి అలాగే ఈ లోకంలో ఉంటాయ‌ని అంటారు. అయితే దెయ్యాలు నిజంగా ఉంటే అవి మ‌న ద‌గ్గ‌రే ఉంటే ఎలాంటి సూచ‌న‌లు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* దెయ్యాలు విద్యుత్ శ‌క్తిని ప్ర‌భావితం చేస్తాయి. అందువ‌ల్ల అవి మ‌న స‌మీపంలో ఉంటే విద్యుత్‌లో హెచ్చు త‌గ్గులు వ‌స్తాయి. బ‌ల్బులు ఆరిపోయి వెలుగుతుంటాయి.

* ఆత్మ‌లు మ‌న చుట్టూ ఉంటే మ‌న ద‌గ్గ‌ర ఉండే వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా మారుతుంది. గ‌దిలో ఎంత వేడి ఉన్నా అక‌స్మాత్తుగా చ‌ల్ల‌గా అనిపిస్తుంది. ఇలా కొంద‌రికి అవుతుంటుంది.

* మీకు అత్యంత ద‌గ్గ‌రి వారు లేదా ఆత్మీయులు చ‌నిపోతే వారి పేరును ప‌దే ప‌దే మీరు వింటున్న‌ట్లు అనిపిస్తుంటే వారి ఆత్మ మీ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు భావించాలి.

* మీ చుట్టూ ప‌రిస‌రాల్లో ఆత్మ‌లు ఉంటే గ‌డియారాలు అక‌స్మాత్తుగా ఆగిపోతుంటాయి.

* చుట్టూ దెయ్యాలు గ‌న‌క ఉంటే అక్క‌డ సీతాకోక చిలుక‌లు లేదా కాకులు తిరుగుతుంటాయి. దీన్ని చైనీయులు ఎక్కువ‌గా విశ్వ‌సిస్తారు.

* అత్యంత ఆత్మీయులు చ‌నిపోతే వారు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు కూడా కొంద‌రికి అనిపిస్తుంటుంది. అయితే సైకిక్స్ చెబుతున్న ప్ర‌కారం వారి ఆత్మ‌ల వ‌ల్లే ఇలా జ‌రుగుతుంది.

* మీ ప‌రిస‌రాల్లో దెయ్యాలు గ‌న‌క ఉంటే కిటికీల బ‌య‌ట నుంచి నీడ‌లు క‌నిపిస్తుంటాయి.

* నిద్ర‌లో అక‌స్మాత్తుగా మెళ‌కువ వ‌చ్చినా, నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించినా, గాల్లో పైకి లేస్తున్న‌ట్లు అనిపించినా.. దాన్ని స్లీప్ పెరాల‌సిస్ అంటారు. కానీ సైకిక్స్ మాత్రం అది ఆత్మ‌ల పనే అని చెబుతుంటారు.

* దెయ్యాలు ఉన్న చోట అదో ర‌క‌మైన దుర్వాస‌న వ‌స్తుంది.

* ఇంట్లో ఒక చోట ఉంచిన వ‌స్తువులు వేరే చోట ద‌ర్శ‌న‌మిస్తున్నా, గాలి లేకున్నా కిటికీలు, త‌లుపులు కొట్టుకుంటున్నా, వింతైన శ‌బ్దాలు వినిపిస్తున్నా.. ఆ ఇంట్లో ఆత్మ‌లు ఉన్న‌ట్లు సైకిక్స్ చెబుతుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM