హైద‌రాబాద్ బిర్యానీ అంటే చాలా ఫేమ‌స్.. కానీ మ‌న దేశంలో ఈ చోట్ల‌లో కూడా బెస్ట్ బిర్యానీ ల‌భిస్తుంది.. ఒక్క‌సారి ట్రై చేసి చూడండి..!

July 17, 2021 12:59 PM

హైద‌రాబాద్ బిర్యానీ అంటే ఎవ‌రైనా స‌రే స‌హ‌జంగానే లొట్ట‌లేసుకుంటూ తింటారు. ఆ బిర్యానీని చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊర‌తాయి. చికెన్, మ‌ట‌న్‌, వెజ్.. ఇలా ఏ వెరైటీని తీసుకున్నా హైద‌రాబాద్ స్టైల్‌లో చేస్తే ఆ బిర్యానీకి ఎవ‌రైనా స‌రే ఫిదా కావల్సిందే. అయితే హైద‌రాబాద్ మాత్ర‌మే కాదు, మ‌న దేశంలో ప‌లు ఇత‌ర ప్రాంతాల్లోనూ బెస్ట్ బిర్యానీ ల‌భిస్తుంది. వాటిని కూడా ఒక్క‌సారి ట్రై చేసి చూడండి. మ‌రి ఏయే ప్రాంతాల్లో అద్భుత‌మైన బిర్యానీ ల‌భిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

these are the famous biryanis available in india

1. కేర‌ళ‌లోని కోజికోడ్ (కాలిక‌ట్‌)లో చ‌క్క‌ని ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. ఎటు చూసినా ప‌చ్చ‌ని ప్రకృతి ద‌ర్శ‌న‌మిస్తుంది. ప‌ర్యాట‌కులు ఇక్క‌డికి ఎక్కువ‌గా వ‌స్తుంటారు. ఇక్కడ ల‌భించే బిర్యానీ హైద‌రాబాద్ బిర్యానీ టేస్ట్‌లా రుచిని క‌లిగి ఉంటుంది. క‌నుక ఈ ప్రాంతానికి వెళితే ఆ బిర్యానీని క‌చ్చితంగా టేస్ట్ చేయండి.

2. కేర‌ళలోని కొచ్చిలోనూ అనేక అద్భుత‌మైన ప‌ర్యాట‌క ప్రదేశాలు ఉన్నాయి. ఇక్క‌డ ల‌భించే బిర్యానీ కూడా చాలా బాగుంటుంది.

3. ఒడిశాలోని క‌ట‌క్‌లో ఎన్నో చారిత్ర‌క ప్ర‌దేశాలు, పర్యాట‌క ప్రాంతాలు ఉన్నాయి. ఇక్క‌డ ల‌భించే బిర్యానీ ఎంతో టేస్ట్‌ను క‌లిగి ఉంటుంది.

4. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం, అడ‌వులు, వ‌న్య‌ప్రాణులు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఇక్క‌డ బిర్యానీ ల‌భిస్తుంది. క‌చ్చితంగా టేస్ట్ చేయాల్సిన బిర్యానీ అది.

5. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో చారిత్ర‌క ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్క‌డ అనేక చోట్ల ల‌భించే బిర్యానీని చాలా మంది ఇష్టంగా తింటుంటారు.

6. వెస్ట్‌బెంగాల్ రాష్ట్రంలో ఉన్న అస‌న్‌సోల్ లో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఇక్క‌డ ల‌భించే బిర్యానీ ఎంతో ఫేమ‌స్‌. చాలా మంది తింటారు.

7. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని గుల్బ‌ర్గాకు ఎంతో చ‌రిత్ర ఉంది. ఇక్క‌డ ర‌క‌ర‌కాల వంట‌కాలు ప‌ర్యాట‌కుల‌కు ల‌భిస్తాయి. అలాగే బిర్యానీ కూడా అందుబాటులో ఉంటుంది. దాన్ని ఒక్క‌సారి క‌చ్చితంగా టేస్ట్ చేయాల్సిందే.

8. దేశ రాజ‌ధాని ఢిల్లీకి స‌మీపంలో ఉండే ఆగ్రాలోనూ బిర్యానీ ల‌భిస్తుంది. అది ఎంతో రుచిగా ఉంటుంది. అక్క‌డికి వెళ్లిన‌ప్పుడు ఆ బిర్యానీని ఒక్క‌సారి రుచి చూడండి.

9. క‌ర్ణాట‌కలోని మైసూర్ లో చారిత్ర‌క ప్ర‌దేశాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు ప‌ర్యాట‌కులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. ఈ ప్ర‌దేశంలోనూ బిర్యానీ ల‌భిస్తుంది. అది భ‌లే రుచిగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment