Tata Docomo : టాటా డొకోమో కొన్ని ఏళ్ల క్రితం ఓ రేంజ్ లో ఊపందుకుంది. భారతదేశంలో ఎక్కువ శాతం మంది డొకోమోని వాడేవారు. దానికి కారణం ఏంటంటే, సెకండ్ కి పైసా సర్వీస్ ని డొకోమో స్టార్ట్ చేసింది. అంతేకాకుండా, సిగ్నల్ కూడా బాగా వచ్చేదట. అయితే, సడన్ గా డొకోమో అర్ధాంతరంగా ఆగిపోయింది. మరి ఎందుకు అంత క్రేజ్ ని తెచ్చుకున్న డొకోమో ఆగిపోయింది, దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్ కి చెందిన ఎన్టీటీ డొకోమోతో, టాటా సంస్థ డొకోమోనీ టాటాడొకోమోగా భారత దేశంలో మొదలుపెట్టారు.
ఆ టైంలో అన్ని కంపెనీలు నిమిషానికి ఇంత అని, డబ్బులు ని కట్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే, డోకోమో మాత్రం సెకండ్ లెక్కన డబ్బులు కట్ చేయడం జరిగింది. ఈ కారణంగా, మిగిలిన కంపెనీలు కూడా, ఇలానే సెకండ్ కి ఇంత అని, డబ్బులు కట్ చేయడం మొదలుపెట్టారు. మొబైల్ యూజ్ చేసే యూజర్ల బిల్, 15 నుండి 12 శాతానికి తగ్గిపోయింది. మొబైల్ ను ఉపయోగించే వాళ్ళకి, ఇది ఈజీ అయ్యింది. డబ్బులు తక్కువ అవుతున్నాయి కాబట్టి, ఇదే బాగుందని ఇలానే మొదలుపెట్టారు.
కానీ, కంపెనీ రెవిన్యూ మాత్రం బాగా తగ్గిపోయింది. జపాన్ కంపెనీ అయిన ఎన్టిటి డొకోమో ఈ వెంచర్ కోసం దాదాపు 14 వేల కోట్ల రూపాయలని, ఇన్వెస్ట్ చేశారు. 2010 స్కామ్ బయటకు వచ్చింది. 2010లో అత్యున్నత ఆడిటింగ్ సంస్థ అయిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, టెలికాం శాఖ లైసెన్స్ విషయంలో, చేసిన పొరపాటుకు సంబంధించి నివేదికను వెల్లడించింది. 2జీ లైసెన్సులు జారీ చేయడం వలన, 1.76 లక్షల కోట్ల నష్టం వచ్చిందని ప్రకటించింది. 2జీ స్కామ్ వలన డొకోమో మీద ప్రభావం గట్టిగా పడింది.
టాటా టెలి సర్వీస్ సరైన మార్గంలో వెళ్లలేదు. కంపెనీ టెలిఫోన్ టవర్ల సంఖ్యని తగ్గించేశారు. షేర్స్ లో కూడా, వాటా తగ్గుతూ వచ్చింది. డొకోమో, టాటా టెలి సర్వీసెస్ మధ్య అభిప్రాయ బేధాలు కూడా వచ్చాయి. ఎయిర్ సెల్ కి ముందు అమ్మేద్దాం అనుకున్నారు. తర్వాత వోడాఫోన్ కి అమ్మేద్దాం అని అనుకున్నారు. డొకోమో 3జీ సర్వీసెస్ ని తీసుకువచ్చింది. కానీ సరిగ్గా ఉపయోగించలేదు.
డొకోమో డబ్బులు తీసుకుని, టాటా సర్వీసెస్ నుండి వెళ్ళిపోయింది. 2017 ప్రకారం టాటా డొకోమోకి కేవలం 3.16% యూజర్లు ఉన్నారు. అంటే 42 లక్షల మంది యూజర్లు. జియో రావడంతో, మెల్లగా యూజర్లు తగ్గిపోయారు. దాంతో టాటా టెలికాం సర్వీసెస్ వేరే వాళ్ళకి అమ్మేసింది. 4,617 కోట్ల నష్టం టాటా టెలి సర్వీసెస్ కి రావడంతో, టాటా డొకోమో సేవలు ని ఆపేసారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…