ఆఫ్‌బీట్

Marriage : తొలిరాత్రి సమయంలో భారతీయులు పాటించే ఆసక్తికరమైన ఆచారాలు..!

Marriage : భారతీయ సాంప్రదాయాల్లో వివాహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక జంటను ఒక్కటిగా చేసే ఈ శుభకార్యం తరువాత నిర్వహించే తొలిరాత్రిని కూడా మన దగ్గర పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే తొలి రాత్రికి ముందు కొన్ని ఆచారాలను పాటించడం పలు వర్గాల్లో ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. అలాంటి ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమ పువ్వు కలిపిన పాలను వధువు చేతికిచ్చి తొలిరాత్రి గదిలోకి పంపించడం హిందూ వివాహ వేడుకలో ఎక్కువగా చూస్తుంటాం. దీని వల్ల ఆ పాలతో దంపతులిద్దరికీ శక్తి కలిగి వారి సంసారం బాగుంటుందని విశ్వసిస్తారు.

కొన్ని భారత సాంప్రదాయాల్లో తొలిరాత్రి ముందు దంపతులిద్దరికీ తినేందుకు పాన్ ఇస్తారు. ఎందుకంటే పాన్ నోటిని శుభ్రం చేసి అందులోని క్రిములను తొలగిస్తుంది. అంతేకాదు నోటిని తాజాగా ఉంచి దంపతులిద్దరూ సువాసనతో మెలిగేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది అత్యంత పురాతనమైన దుర్మార్గపు ఆచారం. చెప్పుకోడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ దీన్ని ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పాటిస్తున్నారు. అదేమిటంటే, తొలిరాత్రి తరువాత వధువు అత్త దంపతుల గదిని పరిశీలించి దుప్పట్లపై రక్తపు మరకలు ఉన్నాయో లేదో చూస్తుంది. ఒకవేళ ఉంటే ఆ వధువు కన్యే అని అర్థం చేసుకుంటారు.

Marriage

కొన్ని సాంప్రదాయాల్లో తొలి రాత్రి రోజున కొత్త బెడ్‌షీట్‌పై దంపతుల కలయికను ఏర్పాటు చేస్తారు. అనంతరం తెల్లవారు జామున వధువు అత్త ఆ బెడ్‌షీట్‌ను పరీక్షించి పైన చెప్పినట్టుగా కోడలి కన్యత్వాన్ని ధృవపరుచుకుంటుంది. అనంతరం దాంతో దేవునికి ప్రార్థన చేసి ఉతకడం కోసం ఇస్తారు. కాల్ రాత్రి అనే ఆచారాన్ని బెంగాలీలు పాటిస్తారు. వీరిలో నూతన దంపతులు తొలిరాత్రికి ముందు రోజు రాత్రి వేర్వేరు గదుల్లో పడుకుంటారు. కనీసం ఒకరి ముఖాన్ని ఒకరు కూడా చూడరు. తెల్లవారుజామున వధువు తన తల్లిగారింటికి వెళ్తుంది. తాను సరైన వ్యక్తితోనే జీవితంలో ముందుకు వెళ్తున్నానని తల్లితో చెప్పి విషయాన్ని ధృవపరుస్తుంది. ఆ రోజే తొలిరాత్రి నిర్వహిస్తారు.

ఈ ఆచారాన్ని మనలో అధిక శాతం మంది పాటిస్తారు. తొలి రాత్రి దంపతులు గడపబోయే గదిని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఎందుకంటే పువ్వుల నుంచి వచ్చే సువాసనల్లాగానే వారి జీవితంలో కూడా పరిమళాలు వికసించాలని, జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని. అంతేకాదు, ఆ పువ్వుల వల్ల గదిలో పూర్తి శృంగారభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుక‌నే అలా అలంక‌ర‌ణ చేస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM