Cancer : క్యాన్సర్.. నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న రోగాల్లో ఇది కూడా ఒకటి. కారణాలేమున్నా క్యాన్సర్ సోకితే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అందుకు తగ్గ ఫలితం ఉంటుంది. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. కింద ఇచ్చిన పలు లక్షణాలను పరిశీలించడం ద్వారా ప్రధానంగా పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు. ఆ లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మంలో అకస్మాత్తు మార్పులు, రక్తస్రావం అవడం, మచ్చల వంటివి ఎక్కువ కాలం ఉంటే ప్రమాదకరంగా మారవచ్చు. అంతే కాదు ఇవి చర్మ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. అలసట, ఆయాసం ఎక్కువగా, ఎక్కువ సేపు ఉంటే అది పెద్దపేగు లేదా పొట్టకు సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. మగవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ దాని లక్షణాలను పరిశీలించాల్సిందే. ఛాతి చుట్టూ ఎరుపుదనం, నిపుల్స్ నుంచి డిశ్చార్జి వంటి లక్షణాలు ఉంటే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్‌గా పరిగణించాలి.
నోట్లో లేదా నాలుకపై తెల్లని ప్యాచ్‌లు ఎక్కువ కాలం పాటు ఉంటే అది ప్రమాదకరమైన ఓరల్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా జ్వరం వచ్చి అది అలాగే కొద్ది నెలల పాటు ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్‌కు సూచనగా భావించాలి. కడుపులో ఎల్లప్పుడూ నొప్పిగా ఉండడంతోపాటు ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉంటే దాన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌గా అనుమానించాలి. ఆహారాన్ని మింగడంలో ఎల్లప్పుడూ ఇబ్బందిగా ఉంటే అది గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ క్యాన్సర్ కావచ్చు.
లింఫ్ గ్రంథులు లేదా గొంతు-మెడభాగంలో ఎల్లప్పుడూ ఉబ్బి ఉన్నా దాన్ని గొంతు క్యాన్సర్‌గా అనుమానించాలి. వృషణాల సైజ్‌లో మార్పు, వాపు, భారంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని వృషణాల క్యాన్సర్‌గా భావించాలి. మ్యూకస్ లేదా ఉమ్మిలో రక్తం వస్తుంటే దాన్ని ఊపిరితిత్తులు లేదా ఓరల్ క్యాన్సర్‌గా భావించాలి. మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తున్నా ఆ పరిస్థితిని ప్రోస్టేట్ క్యాన్సర్‌గా అనుమానించాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…