Bad Dreams : చెడు కలలు వస్తే చెడు జరుగుతుందా..? వాటి సంకేతం ఏంటి..?

March 17, 2023 10:30 AM

Bad Dreams : కలలు కనడం మానవసహజం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కలలొస్తాయి. కలలు అనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. వచ్చిన కలల్ని బట్టి మన లైఫ్ లో కొన్ని ఫలితాలు ఉంటాయని మన పూర్వీకులు చెబుతుంటారు. మంచి కలలు మనకు సంతోషాన్నిస్తే చెడుగా వచ్చే కలలు మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి. చెడు కలలకు అర్థం ఏమిటో తెలుసుకోండి.

చనిపోయిన వారు కలలో వస్తే అర్థం వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని, వారి చావును జీర్ణించుకోలేకపోతున్నారని అర్ధం. మీకు మీరే చనిపోయినట్టు కలలో వస్తే మీలో పాజిటివ్‌ థింకింగ్ కి అది సంకేతం. మీరు నగ్నంగా ఉన్నట్టు కలలో వచ్చిందా మీ ఆత్మగౌరవం తగ్గుతుందనడానికి అది సూచన. అది మీలో అంతర్గత భయాన్ని సూచిస్తుంది. పాములు కలలో వస్తున్నాయా.. పాములను నిజంగా చూడడానికి కలలో చూడడానికి చాలా తేడా ఉంటుంది. నెగటివ్ ఆలోచనలు వ‌స్తున్నాయ‌న‌డానికి అది సంకేతం.

Bad Dreams what is the meaning of them
Bad Dreams

మన భాగస్వామి మనల్ని వదిలేసినట్టుగా లేదా మనకు దూరంగా పోయినట్టుగా కలలొస్తే మన రిలేషన్ షిప్ బాగాలేద‌ని అర్థం. అలాగే వాళ్లతో హ్యాపీ గా లేమని అర్థం చేసుకోవాలి. వాళ్లని వేరొకరికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ఎగ్జామ్ మిస్ అయినట్టు, ఎగ్జామ్ ఫెయిలైనట్టు కలలొస్తే అది మన ఒత్తిడిని సూచిస్తుంది. ఇంట్లో వాళ్లు మనపై పెట్టుకున్న అంచ‌నాల‌ను చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన పడుతున్నామని దానికి అర్థం. మీకు యాక్సిడెంట్ అయినట్టు, గాయపడినట్టు కలలొస్తే మీరు ఆత్మగౌరవం పెంచుకోవాలని సూచిస్తాయి. మీ లైఫ్ బలహీనంగా ఉందని లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని తెలుపుతాయి. చెడు కలలు వచ్చేవారు సృజనాత్మకత కలిగి ఉంటారని అధ్యయనాలు నిరూపించాయి. అయితే చెడు క‌ల‌లు వ‌స్తే చెడు జ‌ర‌గ‌బోతుంద‌న‌డానికి అర్థం కాదు. కానీ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అర్థం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment