Alcohol Spraying On Bed : పడుకునే ముందు మంచం మీద ఇలా ఆల్కహాల్ చల్లితే ఏమవుతుందో తెలుసా..? తప్పక ట్రై చేయాలనుకుంటారు..!

May 1, 2023 10:17 AM

Alcohol Spraying On Bed : ఇంట్లో నల్లులు, తలలో పేలు.. చెవి నొప్పి, దగ్గు ఇలా ఎలాంటి సమస్యనైనా చిటికెలో దూరం చేసే శక్తి ఆల్కహాల్ కి ఉంది. ఏంటి ఇన్‌డైరెక్ట్ గా ఆల్కహాల్ ప్రమోషనా అనుకుంటున్నారా.. లేదండీ బాబూ.. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. మేం మద్యం తాగమని చెప్పట్లేదు. ఆ మద్యం వలన మనం రోజూ ఎదుర్కొనే కొన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఆల్కహాల్ ను రుద్దితే అది క్రిమి సంహారిణి గా పనిచేస్తుంది. ఆల్కహాల్ ను కాస్మొటిక్స్ లో కూడా ఉపయోగిస్తారు. దీనివలన ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసా..?

ఒక బాటిల్ లో ఆల్కహాల్ తీసుకొని మంచాలపై, పరుపులపై చల్లితే నల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా చల్లడం వలన నల్లులు పెట్టే గుడ్లు చనిపోతాయి. కొద్ది రోజులపాటు ఇలా చల్లితే నల్లుల బారినుండి శాశ్వత విముక్తి పొందవచ్చు. డియోడరెంట్ గా కూడా పనిచేస్తుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసన వలన మొదలయ్యే బాక్టీరియాను చంపుతుంది. అయితే ఇది తాత్కాలికంగా మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే చర్మ సంబంధిత అలర్జీలు వస్తాయి. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని రెండు భాగాలు నీరు, ఒక భాగం ఆల్కహాల్ వేసి సీల్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే కూల్ ప్యాక్ తయారవుతుంది. దీన్ని శరీరంపై దెబ్బలకు ఉపశమనంలా ఉపయోగించవచ్చు.

Alcohol Spraying On Bed do you know what happens
Alcohol Spraying On Bed

లావెండర్ నూనె, ఆల్కహాల్ రెండింటిని కలిపి తలపై జుట్టుపై చల్లుకుంటే తలలో ఉన్న పేలను నిర్మూలించవచ్చు. ఈ విధంగా చల్లిన తర్వాత తలను దువ్వుకుంటే చనిపోయిన పేలన్నీ బయట పడతాయి. చాలా మంది తమ చెవులను శుభ్ర‌పరుచుకునేందుకు కాటన్ బడ్స్ వాడుతుంటారు. అయితే వాటి బదులు వెనిగర్, ఆల్కహాల్ మిశ్రమం ఒక కప్ లో తీసుకొని చెవిలో వేసుకుంటే చెవిని శుభ్ర‌పరచుకోవచ్చు. విపరీతమైన దగ్గుతో బాదపడేవారు ఆల్కహాల్ లో నీరు ,సోడా లాంటివేవి కలుపుకోకుండా రా (RAW) గా తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. అలా అని ఎక్కువ ట్రై చేయకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment