కొత్త‌గా పెళ్ల‌యిన త‌న కూతురికి.. 1000 కిలోల చేప‌లు, 1000 కిలోల కూర‌గాయ‌లు, 250కిలోల స్వీట్లు, 50 కోళ్లు, 10 మేక‌లు, 250 ప‌చ్చ‌డి సీసాల‌ను పంపిన తండ్రి..!

July 21, 2021 1:18 PM

కొత్త‌గా పెళ్ల‌యిన వారికి త‌మ కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులు స‌హజంగానే గిఫ్ట్‌ల‌ను పంపిస్తుంటారు. ఎక్కువ‌గా వారి కొత్త ఇంటికి ప‌నికొచ్చే బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తుంటారు. అయితే ఆ తండ్రి మాత్రం త‌న కుమార్తెకు అనుకోని విధంగా భారీ ఎత్తున ప‌లు ర‌కాల బ‌హుమ‌తుల‌ను పంపించాడు. దీంతో ఆమె అత్త వారింటి కుటుంబ స‌భ్యులు ఆ బ‌హుమ‌తుల‌ను చూసి షాక‌య్యారు. వివరాల్లోకి వెళితే..

1000kg Fish,1000Kg Veggies, 250kg Sweets, 50 Chicken, 10 Goats, 250 Pickle Jars Man Sent Special Gift to Newlywed Daughter

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని రాజ‌మండ్రికి చెందిన బ‌త్తుల బ‌ల‌రామకృష్ణ అనే వ్య‌క్తి త‌న కుమార్తె ప్ర‌త్యూష‌కు ఇటీవ‌లే వివాహం జ‌రిపించాడు. పుదుచ్చేరిలోని యానాంకు చెందిన వ్యాపార‌వేత్త కుమారుడు ప‌వ‌న్ కుమార్ కు, ప్ర‌త్యూష‌కు వివాహం జ‌రిగింది. అయితే పెళ్ల‌యిన త‌రువాత ఆమె యానాంకు మారింది. ఈ క్ర‌మంలో ఆషాఢ మాసం సంద‌ర్భంగా బ‌ల‌రామకృష్ణ త‌న కుమార్తెకు భారీ ఎత్తున బ‌హుమ‌తుల‌ను పంపించాడు. అయితే అవ‌న్నీ ఆహార ప‌దార్థాలు కావ‌డం విశేషం.

బ‌ల‌రామకృష్ణ వ్యాపారి. అనుకుంటే పెద్ద ఎత్తున ర‌క ర‌కాల గిఫ్ట్‌ల‌ను ఇవ్వ‌వ‌చ్చు. కానీ వెరైటీగా అత‌ను ఆహార ప‌దార్థాల‌ను పంపించాడు. వాటిల్లో 1000 కిలోల చేప‌లు, 1000 కిలోల కూర‌గాయ‌లు, 250 కిలోల రొయ్య‌లు, 250 కిలోల కిరాణ స‌రుకులు, 250 సీసాల ప‌చ్చ‌ళ్లు, 250 కిలోల స్వీట్లు, 50 కోళ్లు, 10 మేక‌లు ఉన్నాయి. వాటిని ట్ర‌క్కుల్లో లోడ్ ద్వారా యానాంలో ఉంటున్న త‌న కుమార్తె ఇంటికి పంపించాడు. దీంతో ఆ లోడ్‌ల‌ను చూసి ఆమె అత్త వారింటి కుటుంబ స‌భ్యులు షాక‌య్యారు. ఈ వార్త అక్క‌డ అంద‌రికీ తెలిసింది. దీంతో ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment