భ‌లే.. కిలో రూ.5వేల నుంచి రూ.17వేల వ‌ర‌కు అమ్ముడవుతున్న పుల‌స‌..!

July 21, 2021 12:21 PM

పుల‌స చేప‌ల గురించి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏపీలో గోదావ‌రి జిల్లాల్లో పుల‌స బాగా ల‌భిస్తుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందుక‌నే దీన్ని ఎంత ఖ‌రీదుకు అయినా కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. పుస్తెలు అమ్మి అయినా స‌రే పుల‌స తినాలి అనే సామెత అందుక‌నే వ‌చ్చింది.

1 kilo of pulasa fish selling or rs 5000 to 17000

పుల‌స అత్యంత ఖ‌రీదైన చేప‌గా ఉంది. వ‌ర్షాకాలం ప్రారంభంలో గోదావ‌రిలో పుల‌స చేప‌లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. అందుక‌నే వీటికి అంత‌టి ధ‌ర ఉంటుంది. ఇక ప్ర‌స్తుతం గోదావ‌రి జిల్లాల్లో ఈ చేప‌లు కేజీకి రూ.5వేల నుంచి రూ.17వేల వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతున్నాయి. పుల‌స వెరైటీని బ‌ట్టి ఆ ధ‌ర ప‌లుకుతోంది. ఈ సీజ‌న్‌లో ఆయా ప్రాంతాల్లో ఎక్క‌డ చూసినా మ‌న‌కు పుల‌స చేప‌లు బాగా క‌నిపిస్తాయి.

పుల‌స చేప‌ల‌ను కొనుగోలు చేసేందుకు రాజ‌కీయ నాయ‌కులు, సినిమా సెల‌బ్రిటీలు సైతం ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. కొంద‌రు ఈ చేప‌ల‌ను ఇత‌రుల‌కు బ‌హుమ‌తులుగా అంద‌జేస్తుంటారు. కాగా మార్గెట్ వర్గాలు చెబుతున్న ప్ర‌కారం.. ప్ర‌తి రోజూ సుమారుగా 50కిలోల వ‌ర‌కు పుల‌స చేప‌లు మార్కెట్‌కు వ‌స్తుంటాయి. వాటిల్లో సుమారుగా 40కేజీల పుల‌స చేప‌ల‌ను రోజూ అమ్ముతారు.

పుల‌స చేప‌ల కోసం తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల నుంచి కూడా అనేక మంది వ‌స్తుంటారు. జూలై నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు గోదావ‌రి న‌దిలో పుల‌స చేప‌లు ల‌భిస్తాయి. ఈ చేప‌ల‌తో పులుసు పెట్టి తింటే అదిరిపోయే రుచి వ‌స్తుంది. అయితే చేప‌ల‌ను పులుసుగా వండాక ఒక రోజు ఆగి తింటే ఇంకా చ‌క్క‌ని రుచి వ‌స్తుంద‌ని చెబుతారు.

పుల‌స చేప‌ల‌ను ఈ సీజ‌న్ లో చాలా మంది తింటుంటారు. అనేక రెస్టారెంట్ల‌లోనూ దీని వంట‌ల‌ను వ‌డ్డిస్తుంటారు. పుల‌స గోదావ‌రి న‌దిలో ఎదురు ఈదుతుంద‌ని, అందుక‌నే దీనికి అంత రుచి ఉంటుందని చెబుతారు. ఇక కొన్ని చోట్ల అయితే మార్కెట్‌కు రాకుండానే న‌ది వ‌ద్దే వీటిని అక్క‌డికక్క‌డే కొనుక్కెళ్తుంటారు. పుల‌సా.. మ‌జాకా.. మ‌రి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment