రాను రాను అంటూనే పాట‌కు క్రికెట‌ర్ భార్య స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌..

August 10, 2022 6:28 PM

ఈ నెల 12వ తేదీన యాక్షన్ థ్రిల్లర్ గా మాచర్ల నియోజకవర్గం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నితిన్. ఈ చిత్రంలో కృతి శెట్టి నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికిగాను ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కేథరిన్, రాజేంద్రప్రసాద్, ఇంద్రజ, మురళీ శర్మ, సముద్రఖని త‌దిత‌రులు ప్రధాన పాత్ర‌ల్లో న‌టించారు. మాచర్ల నియోజకవర్గం చిత్రానికి స్వర సాగర్ మహతి సంగీత దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్  ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది.

మాచర్ల నియోజకవర్గం చిత్ర ట్రైలర్ లో అందరినీ ఆకట్టుకున్నది అంజలి, నితిన్ కలిసి చేసిన ఐటమ్ సాంగ్. రా రా రెడ్డి అనే ఐటమ్ సాంగ్ లో హీరోయిన్ అంజలి, నితిన్ కలిసి స్టెప్పులు వేయ‌గా.. ఈ పాట మిలియన్ వ్యూస్ దక్కించుకుని సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ఈ పాట చివర్లో నితిన్ నటించిన జయం చిత్రంలోని రాను రానంటూనే చిన్నదో అనే పాటను జోడించారు. ఈ ఐటమ్ సాంగ్ కు ఇది హైలెట్ గా నిలిచింది.

yuzvendra chahal wife dhanasree danced for ranu ranu song video viral

నెటిజన్లు సైతం తమదైన స్టైల్‌లో రా రా రెడ్డి సాంగ్ కు నితిన్, అంజలి లా డాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పాటకు సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. తాజాగా టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కూడా రాను రానంటూనే చిన్నదో అంటూ స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో త‌న వీడియోను పోస్ట్ చేసింది.

ఫుల్ జోష్ తో ధనశ్రీ చేసిన డాన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను సైతం ఫిదా చేస్తోంది. నితిన్, అంజలి మాదిరిగా ధ‌న‌శ్రీ‌ కూడా కంప్లీట్ సింక్ లో స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment