Director : విడాకులకు సిద్ధం అవుతున్న యంగ్ డైరెక్టర్..?

October 17, 2021 3:06 PM

Director : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విడాకులనేవి చాలా కామన్ గా మారాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వారి వైవాహిక బంధం నుండి వేరు అవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు. పెళ్ళై రెండు మూడేళ్ళ బంధం అయినా.. పెళ్ళై ఇరవై, ముప్పై ఏళ్ళు అయినా తమ వివాహ బందానికి బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్యలు కూడా రీసెంట్ గా వారి మ్యారేజ్ లైఫ్ కి గుడ్ బై చెప్పారు.

young Director in bollywood preparing for divorce

ఇక బాలీవుడ్ లో కూడా సెలెబ్రిటీలు విపరీతంగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయం గురించి ఇంకా సినీ ఇండస్ట్రీల్లో టాక్ నడుస్తూనే ఉంది. ఇక మరో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తన భార్యకు డైవోర్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయినే ప్రేమించి పెళ్ళి చేసుకున్న యంగ్ డైరెక్టర్ తో ఆమె బంధం సరిగ్గా ఉండటం లేదని.. ప్రతి విషయానికి పంతానికి పోతున్నట్లు వారి ఫ్రెండ్స్ చెబుతున్నారు. వీరిని కలిపే ప్రయత్నంలో కుటుంబ సభ్యులు సైతం ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది.

పలు చర్చల తర్వాత వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ డైరెక్టర్ టాలీవుడ్ లో కూడా మంచి సినిమాలకు వర్క్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బాలీవుడ్ కి చేరుకుని ఇప్పుడిప్పుడే కెరీర్ ని సెట్ చేసుకునే క్రమంలో ఈ విడాకులు అతని కెరీర్ పై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. అయితే అది పాజిటివ్ గానా.. లేదా నెగిటివ్ గానా.. అనేది తెలియాల్సి ఉంది. అందుకే పెద్దలు పెళ్ళి చేసుకునే ముందు పది సార్లు ఆలోచించాలని చెబుతుంటారు. లేదంటే వారి వివాహ బంధం వల్ల అటు కుటుంబ సభ్యులు, ఇటు పిల్లలు కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment