Viral Video : ఉయ్యాలే.. ఉయ్యాలే.. అంటూ ఊపుతూ డ్యాన్స్ చేసిన యువ‌తి.. వీడియో వైర‌ల్‌..!

June 5, 2022 11:10 AM

Viral Video : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియాలో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. చాలా మంది అందులో నిత్యం విహ‌రిస్తున్నారు. ఊ.. అంటే.. ఏదో ఒక సోష‌ల్ మీడియా యాప్‌ను ఓపెన్ చేయ‌డం.. అందులో డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేయ‌డం అల‌వాటుగా మారింది. కొంద‌రికైతే ఇది నిత్య కృత్యంగా మారింది. అస‌లు అలా రోజూ వీడియోలు పెట్ట‌క‌పోతే ఏదో కోల్పోయిన‌ట్లు కూడా కొంద‌రు ఫీల‌వుతున్నారు. అందులో భాగంగానే ప‌లు సినిమా పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా అలాంటిదే ఒక వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

మోహ‌న్ బాబు, విష్ణులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో అప్ప‌ట్లో వ‌చ్చిన మూవీ.. గేమ్. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. కానీ ఇందులోని పాటలు మాత్రం ప్రేక్ష‌కుల‌కు నచ్చాయి. ఇక ఈ సినిమాలోని ఉయ్యాలే ఉయ్యాలే అనే పాట ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. అయితే ఓ యువ‌తి ఇదే పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించింది. పాట‌లో వేసిన స్టెప్పుల్లాగే ఈమె కూడా డ్యాన్స్ చేయ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

woman danced for Uyyale Uyyale song Viral Video
Viral Video

ఈ వీడియోను చాలా మంది ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు. త‌మ‌కు ఈ వీడియో ఎంత‌గానో న‌చ్చింద‌ని వారు కామెంట్లు చేస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో ఇటీవ‌లి కాలంలో ఇలాంటి వీడియోలు ఎక్కువైపోయాయి. చాలా మంది ఇలా డ్యాన్స్ వీడియోల‌ను అప్ లోడ్ చేస్తున్నారు. దీంతోపాటు త‌మ ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను కూడా వారు పెంచుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment