Woman : ప్రపంచవ్యాప్తంగా మహిళలు నిత్యం ఏదో ఒక సమయంలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమకు ఎదురయ్యే సంఘటనలపై పోరాటం చేస్తారు. ధైర్యంగా వారు పురుషులను ఎదుర్కొంటారు. ఇప్పుడు చెప్పేబోయే మహిళ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తనను వేధించిన ఓ ఆకతాయికి చాలా గట్టిగా బుద్ధి చెప్పింది. ఇంతకూ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని ధార్ అనే ప్రాంతం నుంచి ఓల్డ్ నిసార్‌పూర్ అనే ప్రాంతానికి వెళ్లేందుకు ఒక మహిళ బస్ స్టాండ్ వద్ద నిలుచుని ఉంది. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆ మహిళను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ మహిళ ఉగ్ర రూపం దాల్చింది. పారిపోతున్న ఆ యువకుడిని పట్టుకునేందుకు యత్నించింది. కానీ అతను దొరకలేదు.
చివరకు ఆ యువకుడు తన ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అయినప్పటికీ ఆ మహిళ అతన్ని విడిచిపెట్టలేదు. వెంటబడి మరీ పట్టుకుంది. బయటకు ఈడ్చుకు వచ్చింది. అనంతరం అతని దుస్తులను మొత్తం విప్పేసి నగ్నంగా బజారులో నిలబెట్టింది. ఆ తరువాత ఒక రేంజ్‌లో అతన్ని ఆమె చితకబాదింది. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సదరు మహిళ ధైర్యానికి నెటిజన్లు అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఆ ఘటన అనంతరం ఆ మహిళ ఆ యువకుడిని పోలీసులకు అప్పగించింది. అంతేకాకుండా అతనిపై కేసు పెట్టింది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…