Woman : వేధింపులకు గురి చేసిన యువకుడు.. ఒక రేంజ్‌లో వాయించి విడిచిపెట్టిన మహిళ..!

February 12, 2022 3:49 PM

Woman : ప్రపంచవ్యాప్తంగా మహిళలు నిత్యం ఏదో ఒక సమయంలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమకు ఎదురయ్యే సంఘటనలపై పోరాటం చేస్తారు. ధైర్యంగా వారు పురుషులను ఎదుర్కొంటారు. ఇప్పుడు చెప్పేబోయే మహిళ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తనను వేధించిన ఓ ఆకతాయికి చాలా గట్టిగా బుద్ధి చెప్పింది. ఇంతకూ అసలు ఏం జరిగిందంటే..

woman beat a boy who harassed her
Woman

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ అనే ప్రాంతం నుంచి ఓల్డ్‌ నిసార్‌పూర్‌ అనే ప్రాంతానికి వెళ్లేందుకు ఒక మహిళ బస్‌ స్టాండ్‌ వద్ద నిలుచుని ఉంది. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆ మహిళను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ మహిళ ఉగ్ర రూపం దాల్చింది. పారిపోతున్న ఆ యువకుడిని పట్టుకునేందుకు యత్నించింది. కానీ అతను దొరకలేదు.

చివరకు ఆ యువకుడు తన ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అయినప్పటికీ ఆ మహిళ అతన్ని విడిచిపెట్టలేదు. వెంటబడి మరీ పట్టుకుంది. బయటకు ఈడ్చుకు వచ్చింది. అనంతరం అతని దుస్తులను మొత్తం విప్పేసి నగ్నంగా బజారులో నిలబెట్టింది. ఆ తరువాత ఒక రేంజ్‌లో అతన్ని ఆమె చితకబాదింది. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సదరు మహిళ ధైర్యానికి నెటిజన్లు అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఆ ఘటన అనంతరం ఆ మహిళ ఆ యువకుడిని పోలీసులకు అప్పగించింది. అంతేకాకుండా అతనిపై కేసు పెట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now