ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బాయ్ కాట్ సెగ. దీంతో బాలీవుడ్ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది. వచ్చిన సినిమా వచ్చినట్లే ఫ్లాపవుతూ వస్తోంది. ఈ ఏడాది విడుదలవుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అక్కినేని నాగార్జున.. ఇలా ఈ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. పైగా జక్కన్న రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నాడు. అలాగే సినిమాను తనదైన స్టయిల్‌లో ప్రమోట్ చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి బ్రహ్మాస్త్రను ప్రచారం చేయడంతో సినిమాకు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం జక్కన్న బ్రహ్మాస్త్ర మూవీని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఆ మధ్య రాజమౌళి టీమ్‌తో కలిసి చెన్నైకి వెళ్లి అక్కడ సినిమాను ప్రమోట్ చేశాడు. ఇక తాజాగా హైదరాబాద్‌లో జరగనున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరుకానున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్ కి తన ఫ్రెండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరు కానున్నాడు. బ్రహ్మాస్త్ర మూవీలో రాజమౌళి సీరియస్ గా ఇన్వాల్వ్ అవ్వడాన్ని బట్టి చూస్తే.. జక్కన్న ఈ మూవీకి సమర్పకుడిగా మాత్రమే కాదని, వాస్తవానికి సినిమా రిటర్న్స్‌లో వాటాను కలిగి ఉండవచ్చని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాను ఇక్కడ మార్కెట్ చేసేందుకు మేకర్స్ రాజమౌళి బ్రాండ్ ఇమేజ్‌ని ఉపయోగించుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర మూవీతో రాజమౌళి ఎంత సంపాదిస్తున్నాడో ఆశ్చర్యంగా ఉంది. సినిమా స్థాయిని బట్టి అతను కచ్చితంగా ఫ్యాన్సీ అమౌంట్ ని జేబులో వేసుకుంటాడు అని ఓ తెలుగు నెటిజన్ కామెంట్ చేశాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది. రాజమౌళి ప్రమోషన్స్ వల్ల బాలీవుడ్ కి పూర్వవైభవం వస్తుందో లేదో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…