Kajal Aggarwal : నిర్మాతగా మారిన వెండితెర చందమామ.. విజయం అందుకుంటుందా ?

October 20, 2021 8:47 PM

Kajal Aggarwal : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకసారి స్టార్ డమ్ సంపాదించుకున్న తర్వాత చాలామంది సెలబ్రిటీలు ఇతర వ్యాపార రంగాలలోకి అడుగు పెడతుంటారు. ఇలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారాన్ని కూడా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తుంటారు. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు వ్యాపార రంగాలలో తమ కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.

will Kajal Aggarwal succeed as producer

 

తాజాగా వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఈమె నిర్మాతగా మారి సినిమాలను తెరకెక్కించడానికి ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇతర నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం అయిన కాజల్ అగర్వాల్ ఇప్పటికే వీరి సొంత నిర్మాణ సంస్థలో మనుచరిత్ర అనే సినిమాను తెరకెక్కించారు.

ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా, హీరోయిన్‌గా మేఘా ఆకాష్ నటించారు. అగ్ర నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి కొడుకు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా కాజల్ అగర్వాల్ నిర్మాణంలో మొట్టమొదటిసారిగా తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం అందుకుంటుందా.. లేదా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment