Chiranjeevi : అసలు మెగాస్టార్ కి, రామ్ గోపాల్ వర్మకు ఎక్క‌డ చెడింది ?

October 18, 2021 3:10 PM

Chiranjeevi : రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీలు. రిలాక్స్‌డ్‌ గా ట్విట్టర్ ముందు కూర్చుని ఎక్కడెక్కడ గొడవలు జరుగుతున్నాయా.. ఎవర్ని కామెంట్ చేద్దామా అని చూస్తుండటం వర్మ స్పెషాలిటీ. ఎక్కడ లేని గొడవలను చూసి మరీ వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఆర్జీవీ.. ఇప్పుడు ఆయన తీసే సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించడం లేదు. నాగార్జున హీరోగా శివ సినిమాతో ట్రెండ్ ని సెట్ చేసిన ఘనత రామ్ గోపాల్ వర్మకే దక్కింది.

why ram gopal varma did not make movie with Chiranjeevi

ఆ తర్వాత నాగార్జున, వెంకటేష్ లతో బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్ ని తెరకెక్కించారు. ఆ టైమ్ లోనే చిరు వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ.. అశ్వనీదత్ తో మాట్లాడారు. ఆయన వర్మతో సినిమా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆ టైమ్ లో వర్మ బాలీవుడ్ లో సంజయ్ దత్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. సరిగ్గా అదే టైమ్ లో సంజయ్ దత్ ఓ కేసు విషయమై జైలుకి వెళ్ళడం, వర్మ ఖాళీ అవ్వడం చకచకా జరిగిపోయాయి. అప్పుడే చిరుతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఊర్మిళతో కలిసి చిరు సినిమా స్టార్ట్ చేశారు. ఒక షెడ్యూల్ పూర్తి కావడంతో సంజయ్ దత్ కి బెయిల్ వచ్చింది.

దీంతో ఆ మూవీ చేసేందుకు వర్మ ముంబాయి వెళ్ళాడు. ఆ తర్వాత చిరంజీవి సినిమా చేయలేనంటూ తెలిపారు. దాంతో చిరుకి కోపం వచ్చింది. ఆ తర్వాత హిట్లర్ సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. వర్మ మళ్ళీ వచ్చి సినిమా చేస్తానని చెప్పడంతో.. లైఫ్ లో మళ్ళీ తనకు కనిపించకూడదని వార్నింగ్ ఇచ్చాడు చిరంజీవి. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు చిరంజీవికి, రామ్ గోపాల్ వర్మకు పడదు. అలా చిరు సినీ కెరీర్ లో రామ్ గోపాల్ వర్మతో ఒక్క సినిమా కూడా చేయలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now