Salman Khan : బాలీవుడ్‌లో ఒకప్పుడు ఐశ్వర్యారాయ్, సల్మాన్‌ఖాన్ ల జంట అంటే చూడముచ్చటగా ఉండేది. వీరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడమే తరువాయి, అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది ? ఎందుకు విడిపోయారు ? అనే కారణాలు మాత్రం ఎవరికీ తెలియవు.
నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే.. సల్మాన్, ఐశ్వర్య విడిపోయేందుకు రెండు కారణాలను చెబుతుంటారు. అవేమిటంటే.. తనతో ఉన్న సల్మాన్ ఖాన్‌ను ఐశ్వర్య చీటికీ మాటికీ నిందించేదట. నీకు నేను కావాలో, నీ కుటుంబం కావాలో తేల్చుకో అని అడిగేదట. దీంతో సల్మాన్ ఖాన్ తన కుటుంబానికే ప్రాధాన్యతను ఇచ్చి ఆమెను వదులుకున్నాడని టాక్.
ఇక వారిద్దరూ విడిపోవడానికి ఇంకో కారణం ఉంది. అది ఐశ్వర్యారాయ్ వెర్షన్. ఆమే స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. సల్మాన్ ఖాన్ మద్యం విపరీతంగా సేవిస్తాడని, ఆ మత్తులో తనను శారీరకంగా, మానసికంగా.. అన్ని విధాలుగా చిత్ర హింసలు పెట్టేవాడని, అందుకనే అతని నుంచి దూరం అయ్యానని ఐశ్వర్యారాయ్ చెప్పింది.
అయితే ఇవే కాకుండా.. వారిద్దరూ విడిపోయేందుకు ఇంకో కారణం కూడా అప్పట్లో తెగ ప్రచారం అయింది. ఐశ్వర్యారాయ్‌తో ప్రేమలో ఉండగానే సల్మాన్ ఇంకో హీరోయిన్ వెంట పడ్డాడని.. విషయం తెలిసిన ఐశ్వర్య అతన్ని దూరం పెట్టిందని, దీంతో సల్మాన్ ఒక రోజు ఐశ్వర్య ఇంటికి వెళ్లి ఆమెతో గొడవపడేందుకు యత్నించాడని, కానీ ఆమె తలుపు తెరవలేదని, తరువాత సల్మాన్ ఆమెకు శాశ్వతంగా దూరమయ్యాడని.. అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఏవి నిజమో, ఏవి అబద్దమో తెలియదు, కానీ సల్మాన్ మాత్రం బ్యాచిలర్ గానే ఉండిపోయాడు. ఐశ్వర్యా రాయ్ మరోవైపు అభిషేక్ బచ్చన్‌ను చేసుకుని సంతోషంగా ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…