Bigg Boss 5 : గత సీజన్‌లో అవినాష్ తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తే ఆ బాధ్యతను లోబో తీసుకున్నాడు. ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చిన లోబో సీక్రెట్ రూం నుండి బయటకు వచ్చాక డల్ అయ్యాడు. అతని పర్‌ఫార్మెన్స్ సరిగా లేదని భావించిన హౌజ్ మేట్స్ లోబోని ఎలిమినేట్ చేశారు. అందరూ భోరుభోరున ఏడ్చుకుంటూ హౌజ్ నుండి బయటకు రాగా, లోబో మాత్రం చాలా కూల్‌గా వచ్చేశాడు.
లోబో.. ఒక మంచి కమెడియన్‌గా చాలామంది ప్రేక్షకులకు తెలుసు. తను బయట ఎలా తన కామెడీతో అందరినీ మెప్పించాడో.. హౌస్‌లో కూడా అందరినీ అలాగే ఎంటర్‌టైన్ చేశాడు. తాను చాలా కష్టపడి కెరీర్‌లో పైకి వచ్చానని, బస్తీలో ఉండే కష్టాలన్నీ తాను అనుభవించానని లోబో మాటిమాటికీ చెబుతూ ఉండేవాడు. అప్పటినుండే ప్రేక్షకుల్లో తనపై నెగెటివ్ అభిప్రాయం ఏర్పడింది. నాగార్జున కూడా ఇదే విషయంపై పలుమార్లు లోబోని హెచ్చరించాడు.
లోబో తన ప్రవర్తన మార్చుకోకపోవడం, టాస్క్‌లలో పెద్దగా ఆసక్తి పెట్టకపోవడంతో ప్రేక్షకులు లోబోని ఎలిమినేట్ చేశారు. అయితే బయటకు వచ్చిన లోబో ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్‌లో లోబోకు ఒక్కరోజుకు రూ.35 వేల రెమ్యునరేషనల్ అందిందట. అంటే వారానికి రెండున్నర లక్షలు మొత్తంగా రూ. 20 లక్షల రెమ్యునరేషన్‌ను తీసుకెళ్లాడు లోబో. మోత్తానికి డబ్బుతోపాటు మంచి క్రేజ్ కూడా సంపాదించాడు లోబో.
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…