T20 World Cup 2021 : షార్జా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 29వ మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక వెనుకబడింది. వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లే ఔట్ అయ్యారు. దీంతో లంక జట్టు ఓటమి పాలైంది. శ్రీలంకపై ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో జాస్ బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. 67 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి డి సిల్వ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. శ్రీలంక బౌలర్లలో హసరంగ డిసిల్వ 3 వికెట్లు పడగొట్టగా చమీర 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లకే ఆలౌట్ అయింది. 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బ్యాట్స్‌మెన్‌లలో హసరంగ డిసిల్వ 34 పరుగులు, రాజపక్స, శనక చెరో 26 పరుగుల చొప్పున చేశారు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్‌లు తలా 2 వికెట్ల చొప్పున తీశారు. క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్ స్టోన్ చెరొక వికెట్ తీశారు.
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…