గురువారం, జూన్ 11, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : శ్రీ‌లంక‌పై ఘ‌న విజ‌యం సాధించిన ఇంగ్లండ్

T20 World Cup 2021 : షార్జా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 29వ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై ఇంగ్లండ్ గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీ‌లంక వెనుక‌బ‌డింది. వ‌చ్చిన బ్యాట్స్‌మ‌న్…

T20 World Cup 2021 : శ్రీ‌లంక‌పై ఘ‌న విజ‌యం సాధించిన ఇంగ్లండ్

T20 World Cup 2021 : షార్జా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 29వ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై ఇంగ్లండ్ గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీ‌లంక వెనుక‌బ‌డింది. వ‌చ్చిన బ్యాట్స్‌మ‌న్ వ‌చ్చిన‌ట్లే ఔట్ అయ్యారు. దీంతో లంక జ‌ట్టు ఓట‌మి పాలైంది. శ్రీ‌లంక‌పై ఇంగ్లండ్ 26 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 england won by 26 runs against srilanks in 29th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ల‌లో జాస్ బ‌ట్ల‌ర్ సెంచ‌రీతో చెల‌రేగిపోయాడు. 67 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 101 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స‌ర్ల‌తో 40 ప‌రుగులు చేసి డి సిల్వ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో హ‌స‌రంగ డిసిల్వ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా చ‌మీర 1 వికెట్ తీశాడు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక 19 ఓవ‌ర్ల‌కే ఆలౌట్ అయింది. 137 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గలిగింది. లంక బ్యాట్స్‌మెన్‌ల‌లో హ‌స‌రంగ డిసిల్వ 34 ప‌రుగులు, రాజ‌ప‌క్స‌, శ‌న‌క చెరో 26 ప‌రుగుల చొప్పున చేశారు. మిగిలిన ఎవ‌రూ చెప్పుకోదగిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో మొయిన్ అలీ, ఆదిల్ ర‌షీద్‌, క్రిస్ జోర్డాన్‌లు త‌లా 2 వికెట్ల చొప్పున తీశారు. క్రిస్ వోక్స్‌, లియామ్ లివింగ్ స్టోన్ చెరొక వికెట్ తీశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి