Renu Desai : పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ ఎన్నో ఏళ్ల పాటు సహజీవనం చేశారన్న సంగతి తెలిసిందే. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పవన్ సహజీవనంపై వార్తలు వచ్చాయి. దీంతో అన్నయ్యకు మచ్చ రావొద్దని భావించిన పవన్.. రేణుతో తన సహజీవనానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆమెను అధికారికంగా వివాహం చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ.. తరువాత రెండేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం పవన్ రష్యాకు చెందిన అన్నా లెజినీవాను వివాహం చేసుకున్నారు. ఈమెకు పవన్‌తో తీన్మార్ అనే సినిమా చేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. తరువాత అది పెళ్లికి దారి తీసింది.
అయితే పవన్ కల్యాణ్ తో విడిపోయిన అనంతరం రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లి అక్కడే పూణెలోనే నివాసం ఉంటోంది. కానీ అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తోంది. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అకీరా నందన్, ఆద్యలకు చెందిన ఫొటోలను కూడా ఆమె అప్పుడప్పుడు షేర్ చేస్తోంది. ఇక ఈమధ్యే అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్, రేణులు తమ పిల్లలతో కలిసి ఒకే ఫ్రేములో కనిపించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే అకీరా నందన్‌ను తల్లి రేణు దేశాయ్ పెంచుతున్నందున అతనికి తండ్రి ఇంటి పేరు కొణిదెల అని కాకుండా.. తల్లి పేరు చివర్లో వచ్చేలా అకీరా నందన్ దేశాయ్ అని పెట్టారు. ఈ విషయం అతని గ్రాడ్యుయేషన్ డే రోజు స్పష్టమైంది. అతను తల్లి వద్దే పెరుగుతున్నాడు కనుక ఆమె అలా పెట్టి ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే రేణు దేశాయ్ కి చెందిన రెండో భర్త గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
రేణు దేశాయ్ రెండో భర్త ఎవరు.. అసలు ఆమె వివాహం జరిగిందా.. అని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. అయితే ఆమె రెండో భర్త గురించి అంతగా తెలియదు కానీ.. ఓ షోలో పాల్గొన్నప్పుడు తన రెండో భర్త గురించి వివరాలను వెల్లడించింది. తన రెండో భర్త ఓ సాఫ్ట్‌వేర కంపెనీలో మేనేజర్ అని.. ఆయన అమెరికాలో పనిచేస్తున్నారని.. అయితే ఇండియాలో తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారని చెప్పింది. ఆయన కూడా పూణెలోనే ఉంటారని తెలియజేసింది. అప్పట్లో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి సదరు వ్యక్తితో తనకు జరిగిన ఎంగేజ్‌మెంట్ ఫొటోను కూడా షేర్ చేసింది. అయితే అందులో ఆయన ముఖం సగం వరకే కనిపించేలా జాగ్రత్త పడింది. ఆయనపై ఎక్కువగా ఫోకస్ చేయకుండా.. ఆయన ఎవరో తెలియకుండా ఉండేందుకే ఆమె అలా చేసినట్లు నిర్దారణ అయింది. దీంతో ఆయన ఇబ్బందుల్లో పడతారని ఆమె ముందుగానే గ్రహించింది. కనుకనే ఆయన ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు.
అయితే రేణు దేశాయ్ తనకు ఎంగేజ్‌మెంట్ అయినట్లు మాత్రం నిర్దారించింది. కానీ పెళ్లి జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు. అయితే ఆమె పెళ్లి జరగలేదా.. జరిగితే ఆ విషయం ఎందుకు బయటకు రాలేదని చర్చించుకుంటున్నారు. ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగినప్పుడే పవన్ ఫ్యాన్స్ ఆమెను పెద్ద ఎత్తున విమర్శించారు. దీంతో పెళ్లి విషయాన్ని ఆమె దాచి ఉంచిందని సమాచారం. ఎంగేజ్‌మెంట్ జరిగినప్పుడే అంతటి భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి, ఇక పెళ్లి చేసుకుంటున్నట్లు చెబితే ఇంకా తనను ఏమంటారో అని రేణు దేశాయ్ భయపడి ఉంటుంది. అందుకనే తన పెళ్లి విషయాన్ని దాచి ఉంటుందని సమాచారం. అందుకనే ఆ విషయంపై ఆమె ఇప్పటి వరకు పెదవి విప్పలేదని తెలుస్తోంది. కానీ ఆమెకు పెళ్లి జరిగి ఉంటుందని, సోషల్ మీడియాకు భయపడే ఆ వివరాలను వెల్లడించడం లేదని.. వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ రేణు దేశాయ్ రెండో భర్త గురించి మాత్రం ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…