ఆధ్యాత్మికం

జాతకం ప్రకారం ఏ రాశి వారు ఏ రంగు ర‌త్నాన్ని ధరించాలో తెలుసా ?

మనిషి పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ సమయం ఆధారంగా వారి జీవితం ఎలా ఉండబోతుంది అనేది జాతకం ద్వారా తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే రాశిఫలాలలతోపాటు చంద్రరాశి అనేది మరొకటి ఉంటుంది. ఈ చంద్ర రాశి ఆధారంగా మనిషి పుట్టినప్పుడు వారి స్థానం ఎలా ఉంది అనే విషయంపై ఆధారపడి వారు ఏ రంగు రాళ్లను ధరించాలి అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఏ రాశి వారు ఏ రంగు రాయి ధరిస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా.

* మేష రాశి వారు ఎరుపు రంగు పగడపు రత్నం తొడగాలి.

*  వృషభ రాశి వారు వజ్రపు ఉంగరాన్ని ధరించాలి.

* మిథున రాశి వారు పచ్చ రాయిని తొడగాలి.

* కర్కాటక రాశి వారు ముత్యం ధరించాలి.

* సింహ రాశి వారు కెంపు రాయిని తొడగాలి.

* కన్య రాశి వారు పచ్చ రాయిని తొడగాలి.

*  తులారాశి వారు వజ్రం ధరించాలి.

*  వృశ్చిక రాశి వారు పగడపు రాయి ధరించాలి.

* ధనుస్సు రాశి వారు ప‌సుపు రంగు నీలమణి రాయిని ధరించాలి.

* మకర రాశి వారు నీలం రంగు రాయిని ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది.

*  కుంభ రాశి వారు నీలి రంగు రాయిని ధరించాలి.

*  మీన రాశి వారు ప‌సుపు రంగు నీలమణి రాయిని ధరించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ ర‌త్నాల‌ను భిన్న ర‌కాల లోహాల‌కు చెందిన ఉంగ‌రాల్లో ధ‌రించాల్సి ఉంటుంది. అంటే.. మేష రాశి వారు ఇనుముతో త‌యారు చేసిన ఉంగ‌రంలో ప‌గ‌డం అమ‌ర్చి ధ‌రించాల్సి ఉంటుంది. ఇలా భిన్న రాశుల‌కు భిన్న లోహాలు ఉంటాయి.

వృష‌భ రాశి వారు రాగి, మిథున‌రాశి వారు ప్లాటినం లేదా అల్యూమినియం, క‌ర్కాట‌క రాశి వారు వెండి, సింహ రాశి వారు బంగారం, క‌న్యా రాశి వారు అల్యూమినియం లేదా ప్లాటినం, తుల రాశి వారు రాగి, వృశ్చిక రాశి వారు ఇనుము, ధ‌నుస్సు రాశి వారు బంగారం, మ‌క‌ర రాశి వారు వెండి, కుంభ రాశి వారు అల్యూమినియం లేదా ప్లాటినం, మీన‌రాశి వారు వెండి లోహాల‌కు చెందిన ఉంగ‌రాల్లో ఆయా ర‌త్నాల‌ను ధ‌రించాల్సి ఉంటుంది.

ఇక ఆయా ర‌త్నాలు క‌లిగిన రాళ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ బొట‌న వేలికి ధ‌రించ‌రాదు. ప‌సుపు రంగు నీల‌మ‌ణిని చూపుడు వేలికి ధ‌రించ‌వ‌చ్చు. మ‌ధ్య వేలికి వ‌జ్రం, నీల‌మ‌ణి ఉంగ‌రాల‌ను ధ‌రించ‌వ‌చ్చు. ఉంగ‌రం వేలికి ప‌గ‌డం, కెంపు, ముత్యం ఉంగ‌రాల‌ను ధ‌రించ‌వ‌చ్చు. చిటికెన వేలికి ముత్యం, ప‌చ్చ ఉంగ‌రాల‌ను ధ‌రించ‌వ‌చ్చు.

సోమ‌వారం ముత్య‌పు ఉంగ‌రాన్ని ధ‌రించాలి. మంగ‌ళ‌వారం ప‌గ‌డ‌పు ఉంగ‌రాన్ని, బుధ‌వారం ప‌చ్చ ఉంగ‌రాన్ని, గురువారం ప‌సుపు రంగు నీల‌మ‌ణి ఉంగ‌రాన్ని, శుక్ర‌వారం వ‌జ్ర‌పు ఉంగ‌రాన్ని, శ‌నివారం నీల‌మ‌ణి ఉంగ‌రాన్ని, ఆదివారం కెంపు ఉంగ‌రాన్ని ధ‌రించాలి. ఈ విధంగా ఆయా రాశుల వారు ఆయా ఉంగ‌రాల‌ను ఆయా రోజుల్లో ధ‌రించాల్సి ఉంటుంది. ఇంకా సందేహాలు ఉంటే ఎవ‌రైనా జ్యోతిష్య శాస్త్ర నిపుణున్ని సంప్ర‌దించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM