Whatsapp : దేశవ్యాప్తంగా నవంబర్ నెలలో ఏకంగా 17 లక్షలకు పైగా అకౌంట్లను తొలగించామని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 నవంబర్ నెలలో మొత్తం 602 ఫిర్యాదులు వచ్చాయని, వాటిల్లో 36 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఈ క్రమంలోనే నవంబర్ నెలలోనే ఏకంగా 17,59,000 అకౌంట్లను తొలగించామని వాట్సాప్ తెలియజేసింది.
వాట్సాప్‌లో యూజర్ల భద్రతే తమకు ముఖ్యమని ఆ సంస్థ తెలియజేసింది. యూజర్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. వాట్సాప్‌లో ఎలాంటి వేధింపులకు తావు లేకుండా చూస్తున్నామని స్పష్టం చేసింది.
వాట్సాప్ ప్లాట్‌ఫాంపై యూజర్లకు ఇప్పటికే ఎన్నో సేవలను అందిస్తున్నామని.. ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తున్నామని, దీని వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణల గురించి మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదన్నారు.
కాగా అక్టోబర్ 2021లో వాట్సాప్‌కు మొత్తం 500 ఫిర్యాదులు అందగా ఆ నెలలో 20 లక్షల అకౌంట్లను రద్దు చేసింది. వాటిల్లో ఎక్కువగా బల్క్ మెసేజ్‌లను దురుద్దేశంతో వాడినవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందువల్లే ఆ వాట్సాప్ అకౌంట్లను నిషేధించారు. ఇక వాట్సాప్‌కు దేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…