Uday Kiran : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు దేదీప్యమానంగా వెలుగుతారో ఎప్పుడు చిచ్చుబుడ్డిలా ఆవిరైపోతారో చెప్పడం కష్టం. ఇండస్ట్రీలో ఇలా వచ్చి అలా ఓ నాలుగైదు ఏళ్ళు సినిమాలు చేసి కనుమరుగైన హీరోయిన్స్ మాదిరిగానే దర్శకులు కూడా ఉన్నారు. అలాంటి వారి లిస్ట్‌లో వి.ఎన్. ఆదిత్య కూడా ఒకరు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎం.ఎస్.రాజు నిర్మాతగా మనసంతా నువ్వే సినిమాకి అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇండస్ట్రీలో వి.ఎన్.ఆదిత్య పేరు మార్మోగిపోయింది.
మనసంతా నువ్వే తర్వాత ఉదయ్ కిరణ్ వి.ఎన్.ఆదిత్య కాంబినేషన్ లో శ్రీరామ్ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ ఓసారి అసహనానికి గురయ్యారని ఆదిత్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీరామ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఉదయ్ కిరణ్ కు ఇతర సినిమాల షూటింగ్ లు ఉండటం వల్ల ఆ ఒత్తిడితో అసిస్టెంట్ డైరెక్టర్ పై అరిచారని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ తప్పేమీ లేదని అన్నారు. అసలు పద్ధతి ప్లాన్ లేదా ఒక రాక్షసుడిలా పని చేస్తున్నాను.
ఇండస్ట్రీలో అందరూ సీనియర్ హీరోలే కానీ ఎవరికీ బుర్ర లేదా అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ గట్టిగా అరిచారని చెప్పారు. దీంతో ఉదయ్ కిరణ్ కు ఎన్ని టెన్షన్ లు ఉన్నా అసిస్టెంట్ డైరెక్టర్ పై అరవడం తనకు నచ్చలేదని చెప్పారు. షూటింగ్ కు ప్యాక్ అప్ చెప్పి మధ్యలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయా అని చెప్పారు. దీంతో తన కెమెరామెన్ ఇతర సిబ్బంది కార్ వేసుకుని వచ్చారని అన్నారు. ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని, చనిపోయే వారం ముందు కూడా తనకు ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడని విఎన్ ఆదిత్య ఈ సందర్భంగా తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…