Uday Kiran : చనిపోయే వారం ముందు ఉదయ్ కిరణ్ ఆ డైరెక్టర్ తో మాట్లాడి ఏం చెప్పాడు..?

October 23, 2022 2:23 PM

Uday Kiran : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు దేదీప్యమానంగా వెలుగుతారో ఎప్పుడు చిచ్చుబుడ్డిలా ఆవిరైపోతారో చెప్పడం కష్టం. ఇండస్ట్రీలో ఇలా వచ్చి అలా ఓ నాలుగైదు ఏళ్ళు సినిమాలు చేసి కనుమరుగైన హీరోయిన్స్ మాదిరిగానే దర్శకులు కూడా ఉన్నారు. అలాంటి వారి లిస్ట్‌లో వి.ఎన్. ఆదిత్య కూడా ఒకరు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎం.ఎస్.రాజు నిర్మాతగా మనసంతా నువ్వే సినిమాకి అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇండస్ట్రీలో వి.ఎన్.ఆదిత్య పేరు మార్మోగిపోయింది.

మనసంతా నువ్వే తర్వాత ఉదయ్ కిరణ్ వి.ఎన్.ఆదిత్య కాంబినేషన్ లో శ్రీరామ్ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ ఓసారి అసహనానికి గురయ్యారని ఆదిత్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీరామ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పై ఉదయ్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఉదయ్ కిరణ్ కు ఇతర సినిమాల షూటింగ్ లు ఉండటం వల్ల ఆ ఒత్తిడితో అసిస్టెంట్ డైరెక్టర్ పై అరిచారని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ తప్పేమీ లేదని అన్నారు. అసలు పద్ధతి ప్లాన్ లేదా ఒక రాక్షసుడిలా పని చేస్తున్నాను.

what Uday Kiran told to that director before his death
Uday Kiran

ఇండస్ట్రీలో అందరూ సీనియర్ హీరోలే కానీ ఎవరికీ బుర్ర లేదా అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ గట్టిగా అరిచారని చెప్పారు. దీంతో ఉదయ్ కిరణ్ కు ఎన్ని టెన్షన్ లు ఉన్నా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పై అర‌వ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పారు. షూటింగ్ కు ప్యాక్ అప్ చెప్పి మధ్యలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయా అని చెప్పారు. దీంతో తన కెమెరామెన్ ఇతర సిబ్బంది కార్ వేసుకుని వచ్చారని అన్నారు. ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని, చనిపోయే వారం ముందు కూడా తనకు ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడని విఎన్ ఆదిత్య ఈ సందర్భంగా తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now