Vivek : కరోనా కాలంలో ఎంతో మంది ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తమిళ హాస్య నటుడు వివేక్ గుండె పోటుతో మృతి చెందారు. వివేక్ దాదాపుగా 300కి పైగా చిత్రాల్లో నటించారు. దర్శక శిఖరం కె. బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. ‘మనదిల్ ఉరుది వేండం’ సినిమా ద్వారా ఈయన సినీ అరంగేట్రం చేశారు. అందరు స్టార్ హీరోలతో పని చేసిన ఆయన అపరిచితుడులో విక్రమ్ స్నేహితుడిగా కనిపించి మెప్పించారు.
రజనీకాంత్ శివాజీలో ఆయనకు మేనమామగా, ‘రఘు వరన్ బీటెక్’లో ధనుష్ సహచరుడిగా ‘స్వర్ణపుష్పం’ అంటూ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించారు. హీరో సూర్యతో కలిసి ‘సింగం 2’లో ఎస్‌ఐ పాత్రలో మెప్పించారు. ‘బాయ్స్’ చిత్రంలోనూ నటించారు. చనిపోయే ముందు కోవిడ్ టీకా తీసుకున్న ఆయన.. ‘ప్రతి ఒక్కరూ టీకా తీసుకొని, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి’ అని కోరారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే వివేక్ చనిపోవడంతో.. టీకా వికటించి ఆయన మృతి చెందారనే అనుమానాలు రేకెత్తాయి. దీంతో తమిళనాడులోని విజుపురానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త.. టీకా పొందడం వల్లే వివేక్ చనిపోయారా? అనే కోణంలో విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతంరం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్పష్టతనిస్తూ.. ఆయన గుండె పోటు వల్లనే మృతి చెందాడని పేర్కొంది. దీంతో అందరిలో అనుమానాలు తొలగిపోయాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…