Vivek : పాపుల‌ర్ క‌మెడియ‌న్ కరోనా టీకా వ‌ల్ల చ‌నిపోయాడా..? నిజం ఏంటి ?

October 22, 2021 4:09 PM

Vivek : కరోనా కాలంలో ఎంతో మంది ప్ర‌ముఖులు క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. త‌మిళ హాస్య న‌టుడు వివేక్ గుండె పోటుతో మృతి చెందారు. వివేక్‌ దాదాపుగా 300కి పైగా చిత్రాల్లో నటించారు. దర్శక శిఖరం కె. బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ ఒకరు. ‘మనదిల్‌ ఉరుది వేండం’ సినిమా ద్వారా ఈయన సినీ అరంగేట్రం చేశారు. అంద‌రు స్టార్ హీరోలతో ప‌ని చేసిన ఆయ‌న అపరిచితుడులో విక్రమ్‌ స్నేహితుడిగా క‌నిపించి మెప్పించారు.

Vivek was dead by corona vaccine is it true

ర‌జ‌నీకాంత్ శివాజీలో ఆయ‌న‌కు మేనమామగా, ‘రఘు వరన్‌ బీటెక్‌’లో ధనుష్‌ సహచరుడిగా ‘స్వర్ణపుష్పం’ అంటూ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించారు. హీ‌రో సూర్యతో కలిసి ‘సింగం 2’లో ఎస్‌ఐ పాత్రలో మెప్పించారు. ‘బాయ్స్‌’ చిత్రంలోనూ నటించారు. చ‌నిపోయే ముందు కోవిడ్ టీకా తీసుకున్న ఆయ‌న‌.. ‘ప్రతి ఒక్కరూ టీకా తీసుకొని, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి’ అని కోరారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే వివేక్‌ చనిపోవడంతో.. టీకా వికటించి ఆయన మృతి చెందారనే అనుమానాలు రేకెత్తాయి. దీంతో తమిళనాడులోని విజుపురానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త.. టీకా పొందడం వల్లే వివేక్‌ చనిపోయారా? అనే కోణంలో విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. విచార‌ణ అనంతంరం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్ప‌ష్ట‌తనిస్తూ.. ఆయ‌న గుండె పోటు వ‌ల్ల‌నే మృతి చెందాడ‌ని పేర్కొంది. దీంతో అంద‌రిలో అనుమానాలు తొల‌గిపోయాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment