Viral Video : చీర‌క‌ట్టులో గుర్ర‌పు స్వారీ చేస్తున్న మ‌హిళ‌.. ల‌క్ష‌ల కొద్దీ వ్యూస్‌..!

June 8, 2021 2:06 PM

యూట్యూబ్ చాన‌ల్ పెట్టి సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే వీడియోలు చేసి అప్‌లోడ్ చేస్తుంటారు. కొంచెం టెక్నిక‌ల్ జ్ఞానం ఉంటే ఎవ‌రైనా ఈ ప‌ని చేయ‌వ‌చ్చు. పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. కానీ అందులో కొంచెం వెరైటీని మిక్స్ చేయాలి. అప్పుడే చాన‌ల్ స‌క్సెస్ అవుతుంది. అవును.. ఆ మ‌హిళ కూడా స‌రిగ్గా అలాగే చేసి స‌క్సెస్ అయింది. ల‌క్ష‌ల కొద్దీ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను సంపాదించుకుంది. నెల నెలా రూ. ల‌క్ష‌ల్లో ఆదాయం సంపాదిస్తోంది. ఆమే.. ఒడిశాకు చెందిన మోనాలీసా.

viral video woman rides horse in classical saree outfit

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా జాహ‌ర్ కు చెందిన మోనాలీసాకు వివాహం అయింది. భ‌ర్త బ‌ద్రి నారాయ‌ణ భ‌ద్ర క్రియేట‌ర్ వ‌ర్క‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. 2016లో త‌న భ‌ర్త ప్రోత్సాహంతో ఆమె యూట్యూబ్ చాన‌ల్‌ను ప్రారంభించింది. అప్ప‌టి నుంచి ఆమె ప‌లు భిన్న ర‌కాల వెరైటీ వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తూ నెటిజ‌న్ల అభిమానాన్ని చూర‌గొంది. అన్ని వీడియోల్లోనూ ఆమె చీర‌క‌ట్టుతో క‌నిపిస్తుంది.

చీర‌క‌ట్టులోనే ఆమె గుర్ర‌పు స్వారీ చేస్తుంది. ట్రాక్ట‌ర్‌తో పొలం దున్నుతుంది. ట్ర‌క్ డ్రైవింగ్ చేస్తుంది. బుల్లెట్ న‌డుపుతుంది. వోల్వో బ‌స్ డ్రైవ్ చేస్తుంది. సంప్ర‌దాయ దుస్తుల్లో ఆమె అలా చేస్తుంది కాబ‌ట్టే ఆమె చాన‌ల్ పాపుల‌ర్ అయ్యింది. ప్ర‌స్తుతం ఆమె చాన‌ల్‌కు 22 ల‌క్ష‌ల మంది స‌బ్ స్క్రైబ‌ర్లు ఉండగా ఆమె నెల‌కు రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్న‌ట్లు తెలిసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment