Viral Video : ప్రస్తుత తరుణంలో దేశంలో ఎక్కడ చూసినా యువత.. ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ప్రధానంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులతోపాటు సంబంధిత శాఖలకు చెందిన అధికారులు, ప్రభుత్వాలు డ్రగ్స్ పట్ల ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి సరఫరా ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం.. ఇందులో పలువురు ప్రముఖుల పిల్లలు ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న తమ పిల్లలను ఆ ప్రముఖులు ఎలా కట్టడి చేస్తున్నారో తెలియదు కానీ.. ఓ సాధారణ కుటుంబానికి చెందిన తల్లి మాత్రం గంజాయికి అలవాటు పడ్డ తన కుమారుడిని సరైన దారిలోకి తెచ్చేందుకు వినూత్న పద్ధతిని అవలంబించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి అలవాటు పడ్డ తన 15 ఏళ్ల కుమారుడికి ఓ తల్లి చాలా కఠినమైన శిక్ష విధించింది. మరో మహిళ సహాయంతో తన కుమారున్ని పట్టుకుని చేతులు కట్టిపెట్టి అతని కళ్లపై కారం పూసింది. దీంతో ఆ బాధకు తట్టుకోలేక ఆ బాలుడు విలవిలలాడిపోయాడు. నీళ్లు ఇవ్వమని బతిమాలుతూ తీవ్రంగా దుఃఖించాడు. అయితే అతని బాధను ఆ తల్లి పట్టించుకోలేదు. నీళ్లు ఇవ్వాలంటే గంజాయి మానేస్తానని చెప్పి ఒట్టు వేయాలని ఆమె అడిగింది. దీంతో అందుకు ఒప్పుకున్న అతను అలాగే చేస్తానని.. గంజాయిని ఇకపై ముట్టుకోనని తెలిపాడు. ఈ క్రమంలో అతనికి తన తల్లి నీళ్లు ఇచ్చింది. కాగా ఆ సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కాగా ఆ తల్లి చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న తమ పిల్లలను ఇలా కఠినంగా శిక్షిస్తేనే కానీ వారిలో మార్పు రాదని.. ఆ తల్లి ఇలా చేసినందుకు ఆమెకు హ్యాట్సాఫ్ అని అంటున్నారు. అయితే కొందరు మాత్రం.. మరీ ఇంత కఠినంగా ప్రవర్తించవద్దని.. పిల్లలు డ్రగ్స్ లేదా గంజాయిని మానేసేలా ఇంకా వేరే ఏదైనా మార్గాన్ని అనుసరించాలని.. సూచిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…