Viral Pic : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన తారల చిన్ననాటి జ్ఞాపకాలు చూడడానికి అభిమానులు సైతం ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్స్ తమ త్రో బ్యాక్ పిక్చర్స్ తో సామాజిక మాధ్యమాల్లో హడావిడి చేస్తున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లైవ్ లతో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.
ఇటీవల తాజాగా ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆమె ఎవరో తెలుసా.. ఈమె 2005లో కందల్ నాల్ మిదాల్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. శివ మనసులో శృతి చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. రొటీన్ లవ్ స్టోరీ, తర్వాత కొత్త జంట, రా రా కృష్ణయ్య, పవర్ వంటి ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె ఇంకెవరో కాదు రెజీనా కసాండ్రా.
ఇటీవల విడుదలైన ఆచార్య చిత్రంలో మందాకిని పాత్రలో సానా కష్టం అనే పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి అందరి మదినీ కొల్లగొట్టింది రెజీనా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో రెజీనా కూడా ఒకరు. తాజాగా ఈ అమ్మడు తన చిన్నతనంలో స్కూల్ యూనిఫామ్ తో ఉన్న తన త్రో బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెజీనా కసాండ్రా ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…