Sindhu Menon : 2001లో శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మళయాళీ ముద్దుగుమ్మ సింధూ మీనన్. ఈమె మళయాళీ కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకుంది. సింధు మీనన్ అనేక డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని విజేతగా ఎన్నో బహుమతులను గెలుచుకుంది. సింధు మీనన్ విజేతగా నిలిచిన సమయంలో ఆ ప్రోగ్రాం జడ్జిగా వ్యవహరిస్తున్న భాస్కర్ డైరెక్టర్ కె వి జయరాం సింధు మీనన్ ను వెండి తెరకు పరిచయం చేయడం జరిగింది. 1994 లోజయరాం దర్శకత్వం వహించిన రశ్మి అనే కన్నడ చిత్రంతో సింధు మీనన్ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.
1999లో ప్రేమ ప్రేమ ప్రేమ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సింధు మీనన్. ఆ తర్వాత తెలుగులో భద్రాచలం, త్రినేత్రం, శ్రీరామచంద్రులు, చందమామ వంటి పలు సినిమాలలోనటించి తెలుగు తెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. చందమామ, వైశాలి వంటి సినిమాలతో తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది సింధుమీనన్. ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రేక్షకులలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
తెలుగువారిలో సింధు మీనన్ కి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తర్వాత అవకాశాలు తగ్గడంతో నెమ్మదిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పటి తరం వారికి చాలా వరకు సింధుమీనన్ తెలియకపోవచ్చు. చిత్రాలకు దూరమైన తర్వాత వంశం అనే మళయాళం సీరియల్ ద్వారా సింధుమీనన్ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అంతేకాకుండా టీవీ షోలలో హోస్ట్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత 2010లో ఐటీ ప్రొఫెషనల్ అయిన డొమినిక్ ప్రభును వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప కూడా ఉన్నారు. తాజాగా సింధు మీనన్ ఫ్యామిలీతో దిగిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…