Viral News : ప్రేమ కోసమని కొందరు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. ప్రియుడు లేదా ప్రియురాలు తమ లవర్ కోసం ఎన్నో కష్టాలు పడతారు. వారికి ఎంతో సహాయం చేసి ఆదుకుంటారు. అయితే కొందరు మాత్రం కేవలం స్వార్థం కోసమే ప్రేమను ఉపయోగించుకుంటారు. చివరకు తమ అవసరం తీరాక తమ లవర్‌ను వదిలించుకుంటారు. ఇలాంటి వాళ్లను మనం నిత్య జీవితంలో చూస్తుంటాం. సినిమాల్లోనూ చూపిస్తుంటారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.
మెక్సికోకు చెందిన ఉజియెల్ మార్టినెజ్ స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతను ఓ మహిళను ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె తల్లికి అనారోగ్యం కారణంగా కిడ్నీ చెడిపోవడంతో మార్పిడి చేయాల్సి వచ్చింది. దీంతో మార్టినెజ్ తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చాడు.
వైద్యులు పరీక్షలు చేసి చూడగా.. కిడ్నీ సరిపోయింది. దీంతో మార్టినెజ్ అనుమతి మేరకు అతని ఒక కిడ్నీని తన ప్రియురాలి తల్లికి అమర్చారు. అయితే నెల రోజుల పాటు అంతా బాగానే ఉంది. కానీ సడెన్‌గా మార్టినెజ్ ప్రియురాలు అతన్ని మోసం చేసింది. అతన్ని విడిచిపెట్టింది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని మార్టినెజ్ టిక్‌టాక్ వీడియో ద్వారా తెలియజేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. కొన్ని కోట్ల మంది ఆ వీడియోను వీక్షించారు. అందరూ మార్టినెజ్‌కు సానుభూతి తెలుపుతున్నారు.
ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కోలుకుంటున్నానని.. తన గర్ల్ ఫ్రెండ్‌పై తనకు ఎలాంటి కోపం లేదని, ఆమె సంతోషంగా ఉంటే చాలని.. అంటున్నాడు. అలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకుందని అతని ప్రియురాలిని నెటిజన్లు తీవ్రంగా దూషిస్తున్నారు. ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి పరిస్థితి ఏ లవర్‌కూ రాకూడదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…