Viral News : పానీపూరీ అంటే చాలా మందికి ఇష్టమే. దీన్నే గోల్ గప్పా అని కూడా అంటారు. రహదారులపై మనకు ఎక్కడ చూసినా పానీ పూరీలను విక్రయిస్తుంటారు. ఓపిక ఉండాలే కానీ వీటిని ఇంట్లో కూడా చేసి తినవచ్చు. అయితే ఆ వ్యక్తి పానీ పూరీని తింటే ఏకంగా రూ.500 ఇస్తున్నాడు. అవును నిజమే.. కానీ అక్కడే ఒక మెలిక ఉంది. అదేమిటంటే..
ఆగ్రా – ఫిరోజాబాద్ హైవే పక్కన షలస్ అనే ఓ వ్యాపారి పానీపూరీలను విక్రయిస్తుంటాడు. అయితే తన వ్యాపారం ఇంకా ఎక్కువగా జరగడం కోసం అతనూ పానీపూరీ చాలెంజ్‌ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా వినియోగదారులు అతను ఇచ్చే పానీపూరీని ఒకేసారి తినాల్సి ఉంటుంది. దీంతో రూ.500 గెలుచుకోవచ్చు.
అయితే ఆ పానీ పూరీ సాధారణ సైజులో ఉండదు, కొంచెం పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఒకేసారి నోట్లో పెట్టుకుని మింగేయాలి. ఒక్క నీళ్ల చుక్క కూడా కిందపడరాదు. పడితే చాలెంజ్‌లో ఓడిపోయినట్లే. దీంతో షలస్‌కు రూ.100 ఇవ్వాలి. ఈ క్రమంలో చాలెంజ్‌లో గెలిస్తే రూ.500 అతను ఇస్తాడు.
అయితే ఇప్పటి వరకు ఈ చాలెంజ్‌లో ఎవరూ గెలవలేకపోయారు. అయినప్పటికీ ఆ చాలెంజ్ ను ట్రై చేసేందుకు చాలా మంది అతని వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అతని వ్యాపారం బాగానే కొనసాగుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…