Viral News : ఈ పానీపూరీని మీరు తింటే.. అత‌ను రూ.500 ఇస్తాడు..!

November 17, 2021 5:44 PM

Viral News : పానీపూరీ అంటే చాలా మందికి ఇష్ట‌మే. దీన్నే గోల్ గ‌ప్పా అని కూడా అంటారు. ర‌హ‌దారుల‌పై మ‌న‌కు ఎక్క‌డ చూసినా పానీ పూరీల‌ను విక్ర‌యిస్తుంటారు. ఓపిక ఉండాలే కానీ వీటిని ఇంట్లో కూడా చేసి తిన‌వ‌చ్చు. అయితే ఆ వ్య‌క్తి పానీ పూరీని తింటే ఏకంగా రూ.500 ఇస్తున్నాడు. అవును నిజ‌మే.. కానీ అక్క‌డే ఒక మెలిక ఉంది. అదేమిటంటే..

Viral News if you eat this pani puri then you will get rs 500

ఆగ్రా – ఫిరోజాబాద్ హైవే ప‌క్క‌న ష‌ల‌స్ అనే ఓ వ్యాపారి పానీపూరీల‌ను విక్ర‌యిస్తుంటాడు. అయితే త‌న వ్యాపారం ఇంకా ఎక్కువ‌గా జ‌ర‌గ‌డం కోసం అత‌నూ పానీపూరీ చాలెంజ్‌ను మొద‌లు పెట్టాడు. అందులో భాగంగా వినియోగ‌దారులు అత‌ను ఇచ్చే పానీపూరీని ఒకేసారి తినాల్సి ఉంటుంది. దీంతో రూ.500 గెలుచుకోవ‌చ్చు.

అయితే ఆ పానీ పూరీ సాధార‌ణ సైజులో ఉండ‌దు, కొంచెం పెద్ద‌గా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ దాన్ని ఒకేసారి నోట్లో పెట్టుకుని మింగేయాలి. ఒక్క నీళ్ల చుక్క కూడా కింద‌ప‌డ‌రాదు. ప‌డితే చాలెంజ్‌లో ఓడిపోయిన‌ట్లే. దీంతో ష‌ల‌స్‌కు రూ.100 ఇవ్వాలి. ఈ క్ర‌మంలో చాలెంజ్‌లో గెలిస్తే రూ.500 అత‌ను ఇస్తాడు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చాలెంజ్‌లో ఎవ‌రూ గెల‌వ‌లేక‌పోయారు. అయిన‌ప్ప‌టికీ ఆ చాలెంజ్ ను ట్రై చేసేందుకు చాలా మంది అత‌ని వద్దకు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో అత‌ని వ్యాపారం బాగానే కొన‌సాగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now