Viral News : టాలెంట్ అనేది నిజంగా ఎవరి సొత్తూ కాదు. కొందరికి అది పుట్టుకతోనే వస్తుంది. దానికి కాస్తంత మెరుగులు పెట్టాలే కానీ వారు అద్భుతాలు సృష్టిస్తారు. సరిగ్గా ఆ బాలిక కూడా అలాగే చేస్తోంది. నోరు తిరగడానికి కూడా కష్టమైన వయస్సులో ఏకంగా పెద్ద పెద్ద మంత్రాలు చదివి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఒడిశాలోని జగత్‌సింగ్ పూర్ జిల్లాలో ఉన్న తారాడపాడ గ్రామానికి చెందిన రష్మి రజంన్ మిశ్రా కుమార్తె డి.సాయి శ్రేయాంసి వయస్సు 6 ఏళ్లు. 1వ తరగతి చదువుతోంది. కోవిడ్ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే క్లాసులకు హాజరవుతోంది. అయితే ఈ బాలిక ఎంతో కష్టమైన మంత్రాలను అవలీలగా పఠిస్తోంది.
తాజాగా ఈ బాలిక 24 నిమిషాల 50 సెకన్లలో ఏకంగా 108 మంత్రాలు చదివి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాను రోజూ ఇంట్లో పఠించే మంత్రాలను శ్రద్ధగా విని నేర్చుకున్నానని ఆ బాలిక తెలియజేసింది. అంతేకాదు.. ఆమెకు ఒడిస్సీ నృత్యం కూడా వచ్చు. త్వరలోనే అందులోనూ పేరు తెచ్చుకుంటానని ఆ బాలిక చెబుతోంది. ఏది ఏమైనా.. ఇంత చిన్న వయస్సులో అంత కఠినమైన మంత్రాలను పఠిస్తుందంటే.. ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! కాగా ఈ బాలిక సాధించిన ఈ ఫీట్‌కు గాను ఈమె పేరును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…