Keerthy Suresh : వెండి తెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీనటులు ఆ తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు బుల్లి తెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. చిరంజీవి మొదలుకొని బాలకృష్ణ, నాగార్జున, తారక్, సమంత, తమన్నా వంటి స్టార్ సెలబ్రెటీలు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఇక వీరి బాటలోనే మరోక హీరోయిన్ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బుల్లి తెరపై ఓ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించడం కోసం కీర్తి సురేష్ కార్యక్రమ నిర్వాహకులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించనున్న కీర్తి సురేష్ కు నిర్వాహకులు రూ.15 లక్షల పారితోషికం అందించనున్నట్లు తెలుస్తోంది.
ఆ కార్యక్రమానికి వచ్చే అతిథులతో కీర్తి సురేష్ గేమ్ ఆడించడమే కాకుండా వారిని ఇంటర్వ్యూ చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులకు తెలియజేస్తుందని సమాచారం. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుంది.. ఏమిటి.. అనే విషయాల గురించి త్వరలోనే నిర్వాహకులు అధికారికంగా తెలియజేయనున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఈ కార్యక్రమం నాలుగు భాషలలో ప్రసారం అవుతుందని తెలుస్తోంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…