Viral News : నిర‌స‌న‌లో భాగంగా న‌గ్నంగా ఫొటో షూట్ చేసిన‌ రెండు వందల మంది మోడ‌ల్స్..!

October 19, 2021 9:43 PM

Viral News : ప్రపంచంలో ఎదుటివారి కోసం ఆలోచించే గొప్ప గుణాన్ని ఆ భగవంతుడు మనుషులకు ఇచ్చాడు. ఎదుటివారి ప్రయోజనం కోసం 200 మంది మోడల్స్ చేసిన ఓ పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఓ మంచి పని కోసం 200 మంది మోడల్స్ నగ్నంగా ఒకే చోట నిలబడ్డారు. దాన్ని ఫోటోషూట్ చేసి నెట్టింట్లో పెట్టడంతో హాట్ టాపిక్ గా మారింది. అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

Viral News 200 members protest for reducing water resources

ఇజ్రాయెల్ లో మృత సముద్రం దగ్గర జరిగిన ఈ విశేషానికి కారణం.. ప్రకృతి పరంగా జరిగే విపత్తులు కొన్ని అయితే.. మనిషి చేసే విధ్వంసాలు మరికొన్ని. రీసెంట్ గా ఈ సముద్రం విషయంలో జరిగినదానికి స్పందిస్తూ.. ఈ 200 మంది మోడల్స్ తమ శరీరానికి తెల్లని రంగు వేసుకుని ఫోటో షూట్ లో పార్టిసిపేట్ చేశారు. స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికాకు చెంది 19 నుండి 70 ఏళ్ళ వరకు పురుషులు, మహిళలు ఈ నగ్న నిరసనలో పాల్గొన్నారు.

ఇజ్రాయెల్ లో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. డెడ్ సీ జలాలు అంతకంతకూ తరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు ఈ మోడల్స్ ఆ విధంగా ఫోటో షూట్ ని కండక్ట్ చేశారు.

ఈ ఫోటో షూట్ ని స్పెన్సర్ ట్యూనిక్ అనే 54 సంవత్సరాల ఫోటోగ్రాఫర్ చేశారు. నీటిని ప్రతి ఏడు వాడటం వల్ల డెడ్ సీ ఒక మీటర్ వరకు ఎండిపోయేది. ఇజ్రాయిల్, జోర్డాన్ ల పైనున్న ప్రాంతంలోకి వాటర్ ను మళ్ళించడానికి డెడ్ సీ ఎండుతున్న పరిస్థితి. మరోవైపు మైనింగ్ కూడా సమస్యగా మారింది. ఈ పరిస్థితిని తెలియజేయడం కోసం ఈ నిరసనకు శ్రీకారం చుట్టారు. ఏది ఏమైనా ఈ ఫోటో షూట్ కారణంగా ఇజ్రాయెల్ నీటి సమస్య ప్రపంచవ్యాప్తంగా గుర్తించడానికి కారణం అయ్యింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment