Vijay Devarakonda : ర‌ష్మిక మంద‌న్న‌తో పెళ్లి వార్త‌ల‌పై.. విజ‌య్ దేవ‌ర‌కొండ క్లారిటీ..!

February 22, 2022 5:04 PM

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విష‌యం విదిత‌మే. వీరు త‌ర‌చూ పార్టీల‌కు క‌ల‌సి వెళ్తుంటారు. గ‌తంలో వీరు క‌ల‌సి న‌టించిన ప‌లు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి. అయితే వీరు త‌ర‌చూ ప‌లు చోట్ల క‌ల‌సి క‌నిపిస్తుండ‌డంతో వీరి మ‌ధ్య ఏదో ఉంద‌ని.. వీరు ప్రేమ‌లో ఉన్నార‌ని.. త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఈ మ‌ధ్య ఆ వార్త‌లు ఎక్కువ‌య్యాయి. అయితే వాటిపై ఎట్ట‌కేల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించారు.

ర‌ష్మిక మంద‌న్న, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని, అంద‌రూ అనుకున్న‌ట్లు త‌మ మ‌ధ్య ఏమీ లేద‌ని, తాము పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వస్తున్న వార్త‌లు పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని, వాటిల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని.. అస‌లు ఇలాంటి వార్త‌ల‌ను ఎలా సృష్టిస్తారు ? అంటూ విజ‌య్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు.

Vijay Devarakonda given clarity on his marriage news with Rashmika Mandanna
Vijay Devarakonda

కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లైగ‌ర్ అనే పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నారు. ఇందులో విజ‌య్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తోంది. ఈ మూవీ ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. అలాగే ర‌ష్మిక ప్ర‌స్తుతం ప‌లు బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తోంది. తెలుగులో ఈమె తాజాగా న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు చిత్రం త్వ‌ర‌లో విడుదల కానుంది. అలాగే పుష్ప 2 షూటింగ్‌లో ఈమె త్వ‌ర‌లో పాల్గొన‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now