Vijay Beast Movie Shirt : సినీ సెలబ్రిటీలకు ఉండే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ సినిమా వస్తుందంటే.. వారు ఎంతో సంబరపడిపోతుంటారు. సినిమా థియేటర్ల వద్ద కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చేస్తూ దండలు వేసి పూజలు చేస్తుంటారు. తమ అభిమాన నటీనటులను ఫ్యాన్స్ దేవుళ్లలా చూస్తారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో తలపతి విజయ్ ఒకరు. విజయ్ కు ఉన్న అభిమాన గణం అంతా ఇంతా కాదు. ఈ మధ్యే విడుదలైన ఆయన మూవీ బీస్ట్‌కు ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. సినిమా బాగాలేదని చెన్నైలో ఓ థియేటర్‌లో ఏకంగా స్క్రీన్‌నే తగలబెట్టారు. అలా విజయ్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. అయితే అంత చేసినా తమ అభిమాన హీరో కనుక వారి ఆగ్రహం అప్పటికే పరిమితం అయింది. ఇప్పుడు మామూలుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకో విషయంలో మళ్లీ రచ్చ చేస్తున్నారు.
బీస్ట్ మూవీలో విజయ్ ఓ సన్నివేశంలో చేతిలో గన్ పట్టుకుని తెల్లని షర్టు నిండా రక్తపు మరకలతో.. కళ్లకు చలువ అద్దాలు పెట్టుకుని చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. అయితే ఆ స్టైల్ ఆయన ఫ్యాన్స్‌కు ఎంతగానో నచ్చింది. దీంతో తమ అభిమాన హీరోలా కనిపించాలని వారు కూడా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే రక్తం మరకలను పోలిన ఎరుపు రంగు చల్లిన తెల్లని షర్ట్‌లు.. చలువ కళ్లద్దాలను ధరించి హంగామా చేస్తున్నారు. అయితే ఇలాంటి షర్టులు, అద్దాల కోసం ప్రస్తుతం తెగ డిమాండ్ ఏర్పడింది. తమ వద్దకు ఇలాంటి షర్ట్‌లు, అద్దాలు కావాలని చాలా మంది వస్తున్నారని.. అయితే స్టాక్ ఉండని కారణంగా వాటిని ప్రీ ఆర్డర్లు చేస్తున్నారని.. వర్తకులు తెలిపారు. ఈ క్రమంలోనే విజయ్ షర్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అలాంటి షర్ట్‌లను ధరించేందుకు ఆయన ఫ్యాన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు.
ఇక బీస్ట్ మూవీ ఏప్రిల్ 13వ తేదీన విడుదల కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లను వసూలు చేసింది. నిర్మాతలకు లాభాలు బాగానే వచ్చాయి. కానీ కొనుగోలు చేసిన వారు నష్టపోయారు. ఇక బీస్ట్‌కు బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు గట్టి పోటీని ఇస్తున్నాయి. అందుకనే బీస్ట్ మూవీ ఎక్కువ రోజుల పాటు నిలబడలేకపోయింది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…