Khushboo : ఒకప్పుడు తన అందచందాలతో అదరగొడుతూ ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసిన అందాల తార ఖుష్బూ. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతోంది. నాలుగేళ్ల క్రితం వరకూ ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తూ వచ్చారు ఖుష్బూ. అది కూడా ఎక్కువగా గెస్ట్ రోల్స్ మాత్రమే చేశారు. అయితే ఇప్పుడు కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. ఇటీవల అన్నాత్తేలో నటించారు. తాజాగా విడుదలైన ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రంలో ఓ కీలక పాత్ర చేశారామె. ఇప్పుడు గోపీచంద్ సినిమా చేస్తున్నారు. అలాగే బుల్లితెరపై సందడి చేస్తున్నారు.
తాజాగా మీరా అనే కొత్త సీరియల్‌తో బుల్లితెరపైకి వచ్చారు. ఈ సీరియల్‌కు సంబంధించిన వివరాలను ఖుష్బూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. మహిళలు ఎలాంటి వేధింపులకి గురికాకూడదని నేను నొక్కి చెబుతుంటాను. దాన్ని మరోసారి మీరాతో చెప్పాలని అనుకుంటున్నాను. విలువలతో కూడిన బలమైన వ్యక్తి మీరా. స్వయం కృషితో జీవితంలో పైకి రావడంతోపాటు ఆత్మగౌరవం మెండుగా ఉన్న వైద్యురాలు. వేధింపులకి గురైన మహిళగా అనేక సమస్యలు భరిస్తూ కుటుంబం కన్నా ఏదీ ఎక్కువ కాదు అనేలా ఉంటుంది మీరా.
స్త్రీలను వేధించడం నేను ప్రత్యక్షంగా చూశాను. నా తల్లి కూడా హింస, శారీరక వేధింపులకి గురి కావడం చూశాను. ఆమె మౌనంగా ఉండిపోయింది. అందుకు కారణం ఆమె అది వైవాహిక జీవితంలో భాగమని భావించడం. ఆత్మగౌరవం, గౌరవం విషయంలో రాజీపడాల్సి వచ్చేది. ఈ సీరియల్‌లో ఒక్క చెంపదెబ్బ కొట్టిన భర్త నుండి దూరంగా వెళ్లిన మీరా ఆమె ఎలాంటి వ్యక్తి అనేది చెబుతుంది. చాలా చోట్ల స్త్రీలు గుర్తించబడకపోవడానికి పురుషులే కారణం. ఇంట్లో సమస్యలు ఎదురవుతున్నా చాలా మంది మహిళలు బయట మాట్లాడరు. అయితే సంకోచం, భయం లేకుండా ధైర్యంగా మాట్లాడటం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఖుష్బూ పేర్కొన్నారు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…