Vijay Beast Movie Shirt : బీస్ట్ మూవీలోని విజ‌య్ ష‌ర్ట్‌కు ఫుల్ డిమాండ్‌.. భారీగా కొంటున్న ఫ్యాన్స్‌..!

April 22, 2022 10:06 AM

Vijay Beast Movie Shirt : సినీ సెల‌బ్రిటీల‌కు ఉండే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండ‌దు. త‌మ అభిమాన హీరో లేదా హీరోయిన్ సినిమా వ‌స్తుందంటే.. వారు ఎంతో సంబ‌ర‌ప‌డిపోతుంటారు. సినిమా థియేట‌ర్ల‌ వద్ద క‌టౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చేస్తూ దండ‌లు వేసి పూజ‌లు చేస్తుంటారు. త‌మ అభిమాన న‌టీన‌టుల‌ను ఫ్యాన్స్ దేవుళ్ల‌లా చూస్తారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుల్లో త‌ల‌ప‌తి విజ‌య్ ఒక‌రు. విజ‌య్ కు ఉన్న అభిమాన గ‌ణం అంతా ఇంతా కాదు. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఆయ‌న మూవీ బీస్ట్‌కు ఫ్యాన్స్ నానా ర‌చ్చ చేశారు. సినిమా బాగాలేద‌ని చెన్నైలో ఓ థియేట‌ర్‌లో ఏకంగా స్క్రీన్‌నే త‌గ‌ల‌బెట్టారు. అలా విజ‌య్ ఫ్యాన్స్ ర‌చ్చ చేశారు. అయితే అంత చేసినా త‌మ అభిమాన హీరో క‌నుక వారి ఆగ్ర‌హం అప్ప‌టికే ప‌రిమితం అయింది. ఇప్పుడు మామూలుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకో విష‌యంలో మ‌ళ్లీ ర‌చ్చ చేస్తున్నారు.

Vijay Beast Movie Shirt fans buying them
Vijay Beast Movie Shirt

బీస్ట్ మూవీలో విజ‌య్ ఓ స‌న్నివేశంలో చేతిలో గ‌న్ ప‌ట్టుకుని తెల్లని షర్టు నిండా ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో.. క‌ళ్లకు చ‌లువ అద్దాలు పెట్టుకుని చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. అయితే ఆ స్టైల్ ఆయన ఫ్యాన్స్‌కు ఎంత‌గానో న‌చ్చింది. దీంతో త‌మ అభిమాన హీరోలా క‌నిపించాల‌ని వారు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే ర‌క్తం మ‌ర‌క‌ల‌ను పోలిన ఎరుపు రంగు చ‌ల్లిన తెల్ల‌ని ష‌ర్ట్‌లు.. చ‌లువ క‌ళ్ల‌ద్దాల‌ను ధ‌రించి హంగామా చేస్తున్నారు. అయితే ఇలాంటి ష‌ర్టులు, అద్దాల కోసం ప్ర‌స్తుతం తెగ డిమాండ్ ఏర్ప‌డింది. త‌మ వ‌ద్ద‌కు ఇలాంటి ష‌ర్ట్‌లు, అద్దాలు కావాల‌ని చాలా మంది వ‌స్తున్నార‌ని.. అయితే స్టాక్ ఉండ‌ని కార‌ణంగా వాటిని ప్రీ ఆర్డ‌ర్లు చేస్తున్నార‌ని.. వ‌ర్త‌కులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే విజ‌య్ ష‌ర్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అలాంటి ష‌ర్ట్‌ల‌ను ధ‌రించేందుకు ఆయ‌న ఫ్యాన్స్ ఆస‌క్తిని చూపిస్తున్నారు.

ఇక బీస్ట్ మూవీ ఏప్రిల్ 13వ తేదీన విడుద‌ల కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.200 కోట్ల‌ను వ‌సూలు చేసింది. నిర్మాత‌ల‌కు లాభాలు బాగానే వ‌చ్చాయి. కానీ కొనుగోలు చేసిన వారు న‌ష్ట‌పోయారు. ఇక బీస్ట్‌కు బాక్సాఫీస్ వ‌ద్ద ఆర్ఆర్ఆర్‌, కేజీఎఫ్ 2 సినిమాలు గ‌ట్టి పోటీని ఇస్తున్నాయి. అందుకనే బీస్ట్ మూవీ ఎక్కువ రోజుల పాటు నిల‌బ‌డ‌లేక‌పోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment