Venu Swamy : ప‌వ‌న్ క‌ల్యాణ్, శ్రీ‌జ‌ల‌కు నాలుగు పెళ్లిళ్లు అవుతాయి.. వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

July 19, 2022 11:56 AM

Venu Swamy : గ‌త కొద్ది రోజులుగా మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీ‌జ‌, ఆమె భ‌ర్త క‌ల్యాణ్ దేవ్‌లు విడాకులు తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. వీరు గ‌తంలో ఎప్పుడూ క‌లిసే ఫొటోల్లో క‌నిపించేవారు. కానీ ఇప్పుడు ఎవ‌రికి వారు విడిగా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే స‌మంత చేసిన‌ట్లుగానే శ్రీ‌జ కూడా త‌న భ‌ర్త పేరును తొల‌గించి త‌న ఇంటి పేరు కొణిదెల‌ను చేర్చుకుంది. దీంతో అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. మ‌రోవైపు క‌ల్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీలో జ‌రిగే ఏ వేడుక‌లోనూ క‌నిపించ‌క‌పోవ‌డం, ఆయ‌న సినిమాల‌ను కూడా మెగా ఫ్యామిలీ ప్ర‌మోట్ చేయ‌క‌పోవ‌డంతో.. శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్‌లు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నార‌నే వార్త‌లు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. అయితే ప్ర‌స్తుతం వీరు విడిగా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక శ్రీ‌జ‌తోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కూడా ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న పెళ్లిళ్ల గురించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఈ మ‌ధ్య ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వేణు స్వామి న‌రేష్, ప‌విత్ర లోకేష్‌ల‌పై కామెంట్స్ చేయ‌గా.. అవి వైర‌ల్ అయ్యాయి. న‌రేష్‌కు, ర‌మ్య‌కు జాత‌కాలు క‌ల‌వ‌లేద‌ని.. క‌నుక వారు వివాహం చేసుకున్నా విడిపోతార‌ని తాను ముందుగానే చెప్పాన‌ని.. అప్ప‌ట్లో న‌రేష్ పెళ్లిని కూడా తాను అందుక‌నే చేయ‌లేద‌ని చెప్పారు. తాను చెప్పిన‌ట్లే న‌రేష్ విడాకులు తీసుకున్నార‌ని అన్నారు.

Venu Swamy said Pawan Kalyan and Sreeja will marry 4 times
Venu Swamy

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శ్రీ‌జ‌ల గురించి వేణు స్వామి మాట్లాడుతూ.. ప‌వ‌న్, శ్రీ‌జ ఇద్ద‌రికీ నాలుగేసి చొప్పున పెళ్లిళ్లు అవుతాయి. అప్ప‌టి వ‌ర‌కు వారి వివాహాలు నిల‌డ‌వు. అది వారి జాత‌కాల్లోనే ఉంది.. అంటూ వ్యాఖ్య‌లు చేశారు. అయితే వారు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటారు.. అన్న‌ది వారి వ్య‌క్తిగ‌త విష‌యం అని.. దానిపై మ‌నం మాట్లాడుకోవ‌డం స‌రికాద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే వేణు స్వామి చేసిన వ్యాఖ్య‌లు మ‌ళ్లీ వైర‌ల్ అవుతున్నాయి.

కాగా ప‌వ‌న్ ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చి ఇప్పుడు మూడో భార్య‌తో ఉంటున్నారు. అంటే ఆయ‌న ఇంకో వివాహం కూడా చేసుకుంటార‌ని వేణు స్వామి వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇక శ్రీ‌జ విషయానికి వ‌స్తే ఆమె ఇప్పుడు రెండో పెళ్లితో ఉంది. అంటే ఆమె ఇంకా 2 పెళ్లిళ్లు చేసుకుంటుంద‌ని అర్థం వ‌స్తుంది. మ‌రి వేణు స్వామి వీరి విష‌యాల్లో చెప్పిన జాత‌కాలు నిజం అవుతాయో.. కావో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now