Vehicles : జాత‌కం ప్ర‌కారం ఏ రాశుల వారు ఏ రంగు వాహ‌నాల‌ను వాడాలో తెలుసా ?

Vehicles : సాధార‌ణంగా చాలా మంది వాహ‌నాల‌ను కొనుగోలు చేసిన త‌రువాత వాటికి న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం త‌మ ల‌క్కీ నంబ‌ర్లు వ‌చ్చేలా నంబ‌ర్ల‌ను సెట్ చేసుకుంటుంటారు. కొంద‌రైతే ఫ్యాన్సీ నంబ‌ర్ల కోసం ఎంత ఖ‌ర్చు పెట్టేందుకైనా వెనుకాడ‌రు. అయితే వాహ‌నాల‌ను కొనుగోలు చేసేట‌ప్పుడు క‌చ్చితంగా జాత‌కం ప్ర‌కారం త‌మ రాశికి సంబంధించిన క‌ల‌ర్ క‌లిగిన వాహ‌నాన్నే కొనుగోలు చేయాలి. దీంతో ప్ర‌మాదాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉంటారు. అలాగే ఆ వాహ‌నంపై ఎక్క‌డికి వెళ్లి ఏ ప‌ని చేసినా క‌ల‌సి వ‌స్తుంది. క‌నుక ఎవ‌రైనా స‌రే త‌మ రాశికి అనుగుణంగా క‌ల‌ర్‌ను ఎంపిక చేసుకుని దాని ప్ర‌కారం వాహ‌నాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Vehicles

1. మేష రాశి వారు ఎరుపు రంగు వాహ‌నాల‌ను వాడితే మంచిది. ఈ రంగు వారికి శుభ ఫ‌లితాల‌ను ఇస్తుంది. అయితే ప్ర‌స్తుతం కొన్ని వాహ‌నాలు మిక్సింగ్ క‌ల‌ర్‌లో వ‌స్తున్నాయి. అలాంట‌ప్పుడు మెయిన్ క‌ల‌ర్ రెడ్ ఉండేలా చూసుకోవాలి. దీంతో రాశి ప్ర‌కారం వాహ‌నానికి క‌ల‌ర్ సెట్ అవుతుంది. అది శుభ ఫ‌లితాల‌ను అందిస్తుంది.

2. వృష‌భ రాశి వారు పింక్ లేదా తెలుపు రంగులో ఉండే వాహ‌నాల‌ను వాడితే మంచిది. ఈ రంగులు వారికి క‌ల‌సి వ‌స్తాయి.

3. మిథున రాశి వారు ప‌సుపు రంగు లేదా ఆకుప‌చ్చ రంగుల్లో దేన్న‌యినా వాడ‌వ‌చ్చు. ఆ రంగుల్లో ఉండే వాహ‌నాల‌ను కొని వాడాల్సి ఉంటుంది. దీంతో అనుకూల ఫ‌లితాలు వ‌స్తాయి.

4. క‌ర్కాట‌క రాశి వారు బూడిద రంగు లేదా తెలుపు, సిల్వ‌ర్‌, క్రీమ్ క‌ల‌ర్ల‌లో ఏ రంగు క‌లిగిన వాహ‌నాన్ని అయినా వాడ‌వ‌చ్చు.

5. సింహ రాశి వారు బంగారం, నారింజ‌, ప‌ర్పుల్ రంగుల్లో ఉండే వాహ‌నాల‌ను వాడితే మంచి జ‌రుగుతుంది.

6. క‌న్యా రాశి వారికి నీలం, ఆకుప‌చ్చ, ప‌సుపు, తెలుపు రంగులు శుభ ఫ‌లితాల‌ను అందిస్తాయి. క‌నుక ఈ రంగుల్లో ఉండే వాహ‌నాల‌ను వాడాలి.

7. తుల‌ రాశి వారు తెలుపు, నీలం రంగుల్లో ఉండే వాహ‌నాల‌ను వాడితే మంచిది. అనుకూల ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

8. వృశ్చిక రాశి వారు తెలుపు, ఎరుపు, నారింజ‌, ప‌సుపు రంగుల్లో ఉండే వాహ‌నాల‌ను వాడితే మంచిది.

9. ద‌నుస్సు రాశి వారు ముదురు ప‌సుపు లేదా నారింజ రంగుల్లో ఉండే వాహ‌నాల‌ను వాడాలి. అనుకూల ఫ‌లితాలు వ‌స్తాయి.

10. మ‌క‌ర రాశికి చెందిన వారు న‌లుపు, ప‌ర్పుల్‌, ముదురు గోధుమ‌, ఆకుప‌చ్చ రంగుల్లో ఉండే వాహ‌నాల‌ను వాడ‌వ‌చ్చు.

11. కుంభ రాశి వారు నీలం, ప‌ర్పుల్‌, తెలుపు రంగుల్లో ఉండే వాహ‌నాల‌ను వాడితే మేలు జ‌రుగుతుంది.

12. మీన రాశి వారు ప‌సుపు, నారింజ రంగుల్లో ఉండే వాహ‌నాల‌ను వాడితే మంచిది. అనుకూల ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Vehicles : మెయిన్ క‌ల‌ర్ లేదా అధిక భాగం క‌ల‌ర్..

ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు వాహ‌నాల‌ను మిక్సింగ్ క‌ల‌ర్‌ల‌లో అందిస్తున్న నేప‌థ్యంలో ఒకే క‌ల‌ర్ క‌లిగిన వాహ‌నాలు ల‌భించ‌డం కాస్త క‌ష్ట‌మే అని చెప్ప‌వచ్చు. అయితే మిక్సింగ్ క‌ల‌ర్స్ ఉండే వాహ‌నాల‌ను తీసుకునే ప‌ని అయితే.. వాటిల్లో మెయిన్ క‌ల‌ర్ లేదా అధిక భాగం క‌ల‌ర్ రాశి చ‌క్రానికి చెందిన‌ది అయి ఉండే విధంగా చూసుకోవాలి. దీంతో జాత‌క చ‌క్రం సెట్ అవుతుంది. అనుకూల ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM